Apple Iphone: ఐఫోన్ చాలా ఖరీదు.. అయినా ఎందుకు ఇష్టపడుతారంటే..?

Apple Iphone: యువతలో యాపిల్‌ ఐఫోన్‌కి యమ క్రేజ్‌ ఉంది.

Update: 2023-06-23 13:30 GMT

Apple Iphone: ఐఫోన్ చాలా ఖరీదు.. అయినా ఎందుకు ఇష్టపడుతారంటే..?

Apple Iphone: యువతలో యాపిల్‌ ఐఫోన్‌కి యమ క్రేజ్‌ ఉంది. ఒక్కసారైనా దీనిని కొనుగోలు చేయాలని చాలామంది కోరుకుంటారు. ఇప్పటికే భారత్‌లో ఈ ఫోన్‌ వాడుతున్న సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే దీనిని కొనుగోలు చేయడం అందరికి సాధ్యం కాదు. ఎందుకంటే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది దీనిని వదులుకోవడానికి ఇష్టపడరు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కి చాలా మంది కస్టమర్లు ఉన్నారు. అయితే అధిక ధర ఉన్నప్పటికీ యాపిల్‌ ఐఫోన్.. ఆండ్రాయిడ్‌కు గట్టి పోటీని ఇస్తుంది. ఐఫోన్ ఎంపిక చేసిన మోడల్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే ఖరీదైనప్పటికీ ఐఫోన్ అందరికీ ఎందుకు నచ్చుతోంది. దీని వెనుక ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఐఫోన్‌లో సెక్యూరిటీ సిస్టమ్‌ పటిష్టంగా ఉంటుంది. డేటా భద్రత గురించి ఆందోళన చెందుతున్న వారికి ఐఫోన్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఐఫోన్‌లో వారిడేటా సురక్షితంగా ఉంటుంది. దీనిని ఎవ్వరు హ్యాక్‌ చేయలేరు. అందుకే ఆండ్రాయిడ్‌ ఫోన్ల కంటే ధర ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్‌లో హ్యాంగింగ్ సమస్య ఆండ్రాయిడ్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అందుకే వినియోగదారులందరికీ ఇది బాగా నచ్చుతోంది. దీంతో ఎంత ధరైనా కొనడానికి సిద్దపడుతారు.

బలమైన పనితీరు

ఐఫోన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. దీని వినియోగదారులందరూ గేమింగ్‌లో లేదా బ్యాక్ టు బ్యాక్ ఫోటోలను క్లిక్ చేయడంలో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోరు. ఈ ఫీచర్ కారణంగా ఇది ఆండ్రాయిడ్ కంటే మెరుగైనదిగా పరిగణిస్తారు. ఐఫోన్‌ గంటల తరబడి రెస్ట్‌ లేకుండా పనిచేయగల సామర్థాన్ని కలగి ఉంటుంది. అందుకే ప్రజలు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు.

Tags:    

Similar News