Phone Hacked: ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తే హ్యాక్‌ అయిందని అర్థం.. ఈ విషయాల పట్ల జాగ్రత్త అవసరం..!

Phone Hacked: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది జీవితంలో ముఖ్య భాగంగా మారింది.

Update: 2024-02-24 14:30 GMT

Phone Hacked: ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తే హ్యాక్‌ అయిందని అర్థం.. ఈ విషయాల పట్ల జాగ్రత్త అవసరం..!

Phone Hacked: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది జీవితంలో ముఖ్య భాగంగా మారింది. బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేయడం నుంచి చెల్లింపులు చేయడం వరకు అన్ని దీని ద్వారానే చేస్తున్నారు. ఇవేకాదు ఇంకా చాలా పనులు సులువుగా చేస్తూ సమయం ఆదా చేసుకుంటున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంత ప్రయోజనం ఉందో నష్టం కూడా అంతే ఉంది. బ్యాంక్ అకౌంట్‌ సమాచారం, క్రెడిట్ కార్డ్ సమాచారం, సోషల్ మీడియా ఖాతా సమాచారం మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని చాలామంది సెల్‌ఫోన్‌లలో ఉంచుతున్నారు.

ఈ పరిస్థితిలో ఫోన్ హ్యాక్ అయితే అన్ని వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడుతాయి. దీనివల్ల చాలా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఫోన్ హ్యాక్ అయితే ఫోన్‌లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకోండి.

అనధికార కాల్స్, మెస్సేజ్‌లు

మీ మొబైల్‌కి అనధికార కాల్స్‌, మెస్సేజెస్‌ వస్తున్నట్లయితే మీ ఫోన్ హ్యాక్ అయిందని అర్థం. అనధికార కాల్స్‌, మెస్సేజ్‌ను పంపడానికి హ్యాకర్ మీ ఫోన్‌ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.

తగ్గిన బ్యాటరీ లైఫ్

ఫోన్ మునుపటి కంటే వేగంగా ఛార్జ్ అయిపోతుంటే అది ఫోన్ హ్యాక్ అయిందనడానికి కారణం అవుతుంది. ఒక హ్యాకర్ మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రోగ్రామ్‌ను రన్ చేయగలరు. అది మీ బ్యాటరీని ఖాళీ చేస్తుంది.

ఫోన్ స్లో అవుతోంది

మీ ఫోన్ మునుపటి కంటే నెమ్మదిగా మారినట్లయితే అది హ్యాక్ అయిందని అర్థం. హ్యాకర్ మీ ఫోన్‌లో వైరస్ లేదా మాల్వేర్‌ను చొప్పించవచ్చు. ఇది ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంది.

అనధికార యాప్‌ల ఇన్‌స్టాలేషన్

మీరు ఫోన్‌లో కొత్త యాప్‌లు ఏవీ ఇన్‌స్టాల్ చేయకున్నా అవి మీ ఫోన్‌లో కనిపిస్తే అది మీ ఫోన్ హ్యాక్ అయిందనడానికి కారణం అవుతుంది. హ్యాకర్ మీ ఫోన్‌లో అనధికార యాప్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. దీనివల్ల మీ డేటా చోరీకి గురవుతుంది.

ఫోన్ వేడెక్కడం

ఫోన్ మునుపటి కంటే వేడిగా ఉంటే అది హ్యాక్ అయిందనడానికి సంకేతం అవుతుంది. హ్యాకర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రోగ్రామ్‌ను రన్ చేయగలరు. ఇది ఫోన్‌ను వేడెక్కేలా చేస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

మీ ఫోన్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోండి. ఫోన్‌లో విశ్వసనీయ యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి. అనధికార యాప్‌లు ఫోన్‌కు ప్రమాదకరంగా మారుతాయి. ఫోన్ భద్రతా సెట్టింగ్‌లు, పాస్‌వర్డ్‌లు కఠినంగా ఉండాలి. ఫోన్‌లో యాంటీవైరస్ లేదా యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి. ఇది ఫోన్‌ను వైరస్‌లు, ఇతర మాల్‌వేర్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఫోన్‌లో ఈ మార్పులను గమనించినట్లయితే వెంటనే ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. దీనివల్ల ఫోన్‌లో ఉన్న మొత్తం డేటా తొలగిపోతుంది. కానీ హ్యాకర్ యాక్సెస్ కూడా బ్లాక్ అవుతుంది.

Tags:    

Similar News