Samsungs New Big TV Days Sale: శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌.. స్మార్ట్‌టీవితో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఉచితం..!

Samsungs New Big TV Days Sale: స్మార్ట్‌టీవి కొనాలనేవారికి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది.

Update: 2023-06-19 06:36 GMT

Samsungs New Big TV Days Sale: శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌.. స్మార్ట్‌టీవితో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఉచితం..!

Samsungs New Big TV Days Sale: స్మార్ట్‌టీవి కొనాలనేవారికి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్‌లో స్మార్ట్ టీవీతో పాటు ఉచిత స్మార్ట్ ఫోన్ ఇంకా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందవచ్చు. నిజానికి శామ్‌సంగ్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో శామ్‌సంగ్‌ న్యూ బిగ్‌ టీవి డేస్‌ సేల్‌ని అమలు చేస్తోంది. ఇందులో కొన్ని ఎంపిక చేసిన టీవిల కొనుగోలుకి ఉచిత ఉత్పత్తులు ఇస్తున్నారు.

నియో QLED 8K, Neo QLED, OLED, The Frame, Crystal 4K UHD టీవీల వంటి 55-అంగుళాల, అంతకంటే ఎక్కువ పెద్ద స్క్రీన్ టీవీల కొనుగోలులో ఉచిత బహుమతులు అందిస్తున్నారు. కొన్ని ఆఫర్‌లలో ఉచితంగా Samsung Galaxy S23 Ultra, రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ సేల్ ఇప్పటికే నడుస్తోంది. జూన్ 25 వరకు కొనసాగుతుంది.

స్మార్ట్ టీవీపై ఉచిత Samsung Galaxy S23 Ultra ఆఫర్

కంపెనీ 98-అంగుళాల QN90A Samsung నియో QLED 4K స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.124,999 విలువైన Samsung Galaxy S23 Ultraని ఉచితంగా అందిస్తోంది. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్‌తో వస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ ఆఫర్‌తో పాటు ఎంపిక చేసిన సౌండ్‌బార్‌ల అసలు ధరపై 44 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ 98-అంగుళాల టీవీ చౌకగా రాదు. ఉచిత గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు భారతదేశంలో రూ. 15.74 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కాకుండా ICICI బ్యాంక్, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల నుంచి EMI చెల్లించడం ద్వారా రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు. వినియోగదారులు కంపెనీ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్‌ను ఉచితంగా పొందుతారు. దీని ధర రూ.69,990. ఈ ఆఫర్ 85-అంగుళాల, 75-అంగుళాల Neo QLED 8K TV, 77-అంగుళాల OLED TV, 85-అంగుళాల Neo QLED TV, ఇతర పెద్ద స్క్రీన్ టీవీ మోడళ్లపై అందుబాటులో ఉంది.

75-అంగుళాల Neo QLED 8Kతో 4K టీవీని కొనుగోలు చేస్తే కస్టమర్‌లు రూ.51,990 విలువైన HW-S800B సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ 77-అంగుళాల OLED TV మోడల్‌పై అందుబాటులో ఉంది. మీరు 85-అంగుళాల Crystal 4K UHD TV, 65-అంగుళాల Neo QLED & 8K TV, 65-అంగుళాల OLED TV లేదా 75-అంగుళాల The Frame Samsung TVని కొనుగోలు చేస్తే HW-Q600Bని ఉచితంగా 28,990కి పొందవచ్చు

ఇది కాకుండా 55-అంగుళాల Neo QLED TV, 55-అంగుళాల OLED TV కొనుగోలు చేసే వారికి రూ.15,490 వద్ద HW-B450 సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందవచ్చు. Samsung నుంచి ఈ స్మార్ట్ TV కొనుగోలు చేయడం వల్ల వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. అనేక ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు.

Tags:    

Similar News