Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మరో డివైజ్‌లో లాగిన్‌ ఉందా.? ఇలా లాగవుట్ చేయండి..!

Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మరో డివైజ్‌లో లాగిన్‌ ఉందా.? ఇలా లాగవుట్ చేయండి..

Update: 2024-07-31 08:31 GMT

Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మరో డివైజ్‌లో లాగిన్‌ ఉందా.? ఇలా లాగవుట్ చేయండి..

Instagram: ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ యాప్‌కు అట్రాక్ట్‌ అవుతున్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్‌ ఉందని చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఇతర డివైజ్‌లలో ఇన్‌స్టా లాగిన్‌ అయ్యి, పొరపాటున లాగవుట్ చేయకుండా వదిలేస్తుంటాం. అయితే మన అకౌంట్‌ ఏయే డివైజ్‌లలో లాగిన్‌ అయి ఉంది.? ఎలా లాగవుట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సందర్భాల్లో మన ఇన్‌స్టా లాగిన్‌ డీటెయిల్స్‌తో ఇతరులు కూడా లాగిన్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో అసలు మీ ఇన్‌స్టా అకౌంట్‌ ఎన్ని డివైజ్‌లలో లాగిన్‌ ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న చిట్కా ఉంది. సెట్టింగ్స్‌లో చిన్న ట్రిక్‌తో ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇతర డివైజ్‌లలో లాగిన్ అయిన ఖాతాను ఎలా లాగవుట్‌ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..

* ఇందుకోసం ముందుగా మీ ఇన్‌స్టాలోకి లాగిన్‌ అయ్యి ప్రొఫైల్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి.

* అనంతరం ఎగువన కనిపించే మూడు చుక్కలు కనిపిస్తాయి.

* ఈ మూడు చుక్కలపై క్లిక్ చేసిన తర్వాత, మీరు సెట్టింగ్‌లో ప్రైవసీ ఆప్షన్‌ కనిపిస్తుంది.

* ప్రైవసీ ఆప్షన్‌ సెలక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ సెంటర్‌లోకి వెళ్తారు.

* అనంతరం అక్కడ పాస్‌వర్డ్‌ అండ్‌ సెక్యూరిటీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

* ఆ ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే సెక్యూరిటీ చెక్‌ ఆప్షన్‌కు వెళ్లాలి. వెంటనే మీ లాగిన్‌ డీటెయిల్స్‌ కనిపిస్తాయి.

* ఇందులో మీరు ఎక్కడ లాగిన్‌ అయ్యో తెలియజేస్తుంది.

* వాటిపై క్లిక్‌ చేయగానే ఏయే డివైజ్‌లలో లాగిన్‌ అయి ఉందో తెలిసిపోతుంది. సదరు డివైజ్‌ను సెలక్ట్ చేసుకొని లాగవుట్‌ అయితే సరిపోతుంది.

Tags:    

Similar News