Solar Power Generator: చౌకైన సోలార్‌ పవర్‌ జనరేటర్.. కరెంట్‌ లేకున్నా టీవీ, ఫ్యాన్ రన్‌ అవుతాయి..!

Solar Power Generator: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వల్ల కరెంట్‌ పోతూ ఉంటుంది.

Update: 2023-07-16 14:30 GMT

Solar Power Generator: చౌకైన సోలార్‌ పవర్‌ జనరేటర్.. కరెంట్‌ లేకున్నా టీవీ, ఫ్యాన్ రన్‌ అవుతాయి..!

Solar Power Generator: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వల్ల కరెంట్‌ పోతూ ఉంటుంది. దీంతో ఇంట్లో చీకటి వల్ల చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ఇబ్బంది ఉంటుంది. ఫ్యాన్‌ తిరగకపోవడంతో గాలిరాక పిల్లలు నిద్రపోలేరు. లైట్లు లేకపోవడంతో ఇళ్లంతా చీకటిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే సోలార్ పవర్ జనరేటర్‌ ఉండాలి. దీనివల్ల కరెంట్‌ పోయిన తర్వాత కూడా ఫ్యాన్, లైట్‌ రన్‌ అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక ఫోర్టబుల్‌ సోలార్‌ పవర్‌ జనరేటర్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

కొత్తగా SARRVAD పోర్టబుల్ సోలార్ పవర్ జనరేటర్ S-150 మార్కెట్‌లోకి వచ్చింది. ఇది చిన్న బ్యాటరీ పరిమాణం కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు. టీవీ, ల్యాప్‌టాప్ వంటి చిన్న పరికరాలని నడిపిస్తుంది. ఇది చాలా తేలికైన, శక్తివంతమైన పరికరం దీని సామర్థ్యం 42000mAh 155Wh. ఐఫోన్ 8ని సుమారు 8 సార్లు ఛార్జ్ చేయవచ్చు. దీని బరువు 1.89 కిలోలు, చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీన్ని సోలార్ ప్యానెల్‌తో (14V-22V / 3A గరిష్టంగా) సూర్యకాంతి ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

దీని ధర గురించి మాట్లాడినట్లయితే రూ.19,000 సరసమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇది చాలా చిన్నది కాబట్టి బ్యాగ్‌లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాప్‌టాప్, రేడియో, పవర్‌బ్యాంక్, స్మార్ట్‌ఫోన్‌తో సహా అన్ని చిన్న పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల జేబుపై ఎటువంటి భారం పడదు. తరచుగా విద్యుత్‌ సమస్యలుండే ప్రాంతాల్లో ఈ పరికిరం బాగా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News