Data Protection Bill : వ్యక్తిగత సమాచార రక్షణకు కేంద్రం పటిష్ట చర్యలు... రూ.500 కోట్లు జరిమానా ప్రతిపాదించిన బిల్లు...

Digital Personal Data Protection Bill: ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించేందుకు కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

Update: 2022-11-18 14:21 GMT

Data protection Bill : వ్యక్తిగత సమాచార రక్షణకు కేంద్రం పటిష్ట చర్యలు... రూ.500 కోట్లు జరిమానా ప్రతిపాదించిన బిల్లు...

Digital Personal Data Protection Bill: ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించేందుకు కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్రం విడుదల చేసింది. సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. జరిమానాను 500కోట్ల వరకు పెంచుతూ తాజా ముసాయిదాలో ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.

కంపెనీలు సేకరించే వ్యక్తిగత సమాచారం స్థానికంగానే నిల్వచేయడం, నిల్వ చేసే కాలపరిమితి, మునుపటి సమాచారాన్ని తొలగించడం వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ ముసాయిదా బిల్లు డిసెంబర్‌ 17 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికల్లో జరిగే సమాచార ఉల్లంఘనలను నియంత్రించేందుకు పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2019లోనే తీసుకువచ్చింది. అయితే విపక్షాల అభ్యంతరాలతో ఆ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. 

Tags:    

Similar News