Smartphone Settings: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ చేస్తే ఎవరూ మీ పర్సనల్‌ ఇన్ఫర్‌మేషన్‌ దొంగిలించలేరు..!

Smartphone Settings: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇందులో వారికి సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ పోయిందంటే చాలా టెన్షన్‌ గురవుతారు.

Update: 2023-12-17 13:00 GMT

Smartphone Settings: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ చేస్తే ఎవరూ మీ పర్సనల్‌ ఇన్ఫర్‌మేషన్‌ దొంగిలించలేరు..!

Smartphone Settings: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇందులో వారికి సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ పోయిందంటే చాలా టెన్షన్‌ గురవుతారు. నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కాల్ చేయడానికి మాత్రమే కాదు, పర్సనల్‌ వివరాలు స్టోర్‌ చేసే పరికరం కూడా. ఈ పరిస్థితిలో ఎవరైనా మీ ఫోన్‌ని దొంగిలించినా, ఉపయోగించడానికి ప్రయత్నించినా మీ సమాచారం మొత్తం తెలిసిపోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఫోన్‌లో కొన్ని సెట్టింగ్‌లు చేయడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ చేయడం వల్ల మీరు ఫోన్‌ని ఎవరికైనా ఇవ్వొచ్చు. వారి ఇందులో నుంచి ఎటువంటి సమాచారం పొందలేరు. మీరు ఎవరికైనా ఫోన్ ఇవ్వడానికి ముందు ఫోన్‌లో ఈ సెట్టింగ్ చేస్తే అవతలి వ్యక్తి మీ ఫోన్‌ని ఆటోమేటిక్‌గా తిరిగి ఇచ్చేస్తాడు. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఎవరైనా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ కెమెరా ఓపెన్‌ అవుతుంది. ఎవరైనా మీ ఫోన్ గ్యాలరీని ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ సెట్టింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఇలా మొత్తం కన్ఫూజన్‌గా ఉంటుంది.

ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో థర్డ్-పార్టీ యాప్ X ఐకాన్ ఛేంజర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత మీరు మార్చాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. ఉదాహరణకు మీరు ఇన్‌స్టాగ్రామ్‌ను మార్చాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌ని ఎంచుకోండి. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ గుర్తును కెమెరా గుర్తుతో రిప్లేస్‌ చేయండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్‌ చేయడానికి ట్రై చేస్తే ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇది చూసిన వారు వెంటనే షాక్‌ అవుతారు. వెంటనే మీ ఫోన్‌ తిరిగి ఇచ్చేస్తారు.

Tags:    

Similar News