BSNL 5G Phone: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 5జీ ఫోన్‌ వస్తుందా.? ఇందులో నిజమెంత.. ?

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2024-08-15 05:25 GMT

BSNL 5G Phone: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 5జీ ఫోన్‌ వస్తుందా.? ఇందులో నిజమెంత.. ?

BSNL 5G Phone: ప్రస్తుతం దేశంలోని టెలికం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాజాగా టెలికం సంస్థలు రీఛార్జ్‌ టారిఫ్‌లను పెంచిన తర్వాత ఇది మరింత తీవ్రతరమైంది. జియో, ఎయిర్‌టెల్‌,వీఐ ఇలా అన్ని ఆపరేటర్లు ఛార్జీలను పెంచాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

టారిఫ్‌లను పెంచడమే కాకుండా, తక్కువ ధరలో ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ప్రముఖ టెలికం కంపెనీలకు పోటీనిస్తూ ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇక 5జీ సేవలను కూడా తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారని, ధర కూడా తక్కువగా ఉంటుందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై బీఎస్‌ఎన్‌ఎల్ అధికారికంగా స్పందించింది.

నెట్టింట వైరల్ అవుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది. ఇలాంటి విషయాలను నమ్మొద్దని, ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడవద్దని తెలిపింది. ఏ సమాచారమైనా బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసి ధృవీకరించుకోవాలని సూచించింది. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఎలాంటి స్మార్ట్‌ ఫోన్‌ తీసుకురావడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.


Tags:    

Similar News