Branded Smartwatches: బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లు తక్కువ ధరకే.. పండుగ బంపర్ ఆఫర్..!
Branded Smartwatches: ఈ రోజుల్లో అందరు స్మార్ట్‌ఫోన్లని వదిలేసి స్మార్ట్‌వాచ్‌లపై మొగ్గుచూపుతున్నారు.
Branded Smartwatches: ఈ రోజుల్లో అందరు స్మార్ట్‌ఫోన్లని వదిలేసి స్మార్ట్‌వాచ్‌లపై మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా యువత వీటికి బాగా ఆకర్షితులవుతున్నారు. అందుకే కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో మెరుగైన ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను విడుదలచేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ప్రారంభమైంది. ఇందులో స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. వినియోగదారులు చాలా శక్తివంతమైన AMOLED డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
Noise Color Fit Pro 4 Alpha
Noise నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ రూ.1,999కి అందుబాటులో ఉంది. ఇది 1.78 అంగుళాల AMOLED రౌండ్ డిస్‌ప్లే, ఫంక్షనల్ క్రౌన్, స్ట్రెస్ ట్రాకింగ్‌తో SPO2 మానిటరింగ్ వంటి వివిధ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ సపోర్ట్ అందిస్తుంది. దీని అసలు ధర రూ.7999 కానీ అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తుంది.
boAt Xtend Plus
boAt Xtend Plus ప్రస్తుతం Amazonలో రూ.1,999 ధరకు లభిస్తుంది. ఇది 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, SPO2 మానిటరింగ్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్ 700 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ సపోర్ట్‌ను అందిస్తుంది. వాస్తవ ధర రూ.8999 కానీ ఇప్పుడు చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
Fire-Bolt Visionary
Fire Bolt Visionary రూ. 2,199కి అందుబాటులో ఉంది. ఇది 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, స్ట్రెస్ ట్రాకింగ్‌తో SPO2 మానిటరింగ్ వంటి వివిధ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్‌లో 700 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. సాధారణ ఉపయోగంలో ఐదు రోజుల వరకు బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది. అదనంగా IP68 వాటర్ రెసిస్టెంట్, AI వాయిస్ సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ధర రూ.16999 అయితే అమెజాన్ లో డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది.
Noise Fit Halo
Amazonలో Noise Fit Halo ధర రూ. 2,499. ఇది 1.43 అంగుళాల AMOLED రౌండ్ డిస్‌ప్లే, SPO2 మానిటరింగ్‌తో పాటు స్ట్రెస్ ట్రాకింగ్ వంటి వివిధ ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ గడియారం సాధారణ ఉపయోగంలో ఏడు రోజుల వరకు బ్యాటరీ సపోర్ట్‌ను అందిస్తుంది. దీని అసలు ధర రూ.7999 అయితే అమెజాన్‌లో భారీ తగ్గింపు ఉంది.