SIM Card Frauds: మీకు తెలియకుండా మీ ఆధార్‌పై సిమ్‌ తీసుకొని వాడుతున్నారా.. ఇలా చెక్‌ చేయండి..!

SIM Card Frads: నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరగడంతో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Update: 2023-10-21 05:48 GMT

SIM Card Frauds: మీకు తెలియకుండా మీ ఆధార్‌పై సిమ్‌ తీసుకొని వాడుతున్నారా.. ఇలా చెక్‌ చేయండి..!

SIM Card Fradus: నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరగడంతో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు అమాయకుల డేటా దొంగిలించి వారి పేరుపై మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు 658 సిమ్ కార్డులను ఒక ఆధార్ కార్డుతో లింక్ చేసినట్లు గుర్తించారు. అందుకే మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌కార్డులు పనిచేస్తున్నాయో తెలుసుకోవడం అవసరం. లేదంటే మీకు తెలియకుండానే ఏదైనా ఫ్రాడ్స్‌లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. పోలీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులు దాపురిస్తాయి. అయితే మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌లు యాక్టివేట్‌గా ఉన్నాయో ఈ విధంగా తెలుసుకోవచ్చు.

నియమం ఏమి చెబుతుంది?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డ్‌పై ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులను కలిగి ఉండటానికి అనుమతి ఉంది. అయితే ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పేరుపై ఎన్ని SIM కార్డ్‌లు ఉపయోగించబడుతున్నాయో తెలుసుకోవడానికి DoT వెబ్‌పేజీని మెయింటెన్ చేస్తుంది. ఇందుకోసం tafcop.dgtelecom.gov.in (సంచార్ సతి)ని సందర్శించవచ్చు.

ఇలా చెక్‌ చేయండి

1. సంచార్ సతి అధికారిక వెబ్‌సైట్ అంటే www.sancharsthi.gov.ఇన్ కి వెళ్లండి.

2. ఇప్పుడు రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

3. మీ మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. న్యూ పేజీకి వెళుతారు.

5. మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

6. క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేయండి.

7. OTPని ఎంటర్‌ చేయండి.

8. మళ్లీ న్యూ పేజీకి వెళుతారు.

9. ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌తో నమోదు అయిన మొబైల్‌ నెంబర్ల జాబితా చూస్తారు.

Tags:    

Similar News