Samsung Galaxy A35 5G: జాతర షురూ.. సామ్‌సంగ్ క్రేజీ ఫోన్.. రూ. 5 వేల డిస్కౌంట్..!

Samsung Galaxy A35 5G: అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌‌పై రూ.5 వేల డిస్కౌంట్ ఆందిస్తోంది.

Update: 2024-09-22 12:37 GMT

Samsung Galaxy A35 5G

Samsung Galaxy A35 5G: టెక్ దిగ్గజం సామ్‌సంగ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక బ్రాండ్ సామ్‌సంగ్. ఇది రోజురోజుకు మార్కెట్‌లో తన షేర్‌ను పెంచుకుంటూనే ఉంది. టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఇంత డిమాండ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్‌లో భాగంగా Samsung Galaxy A35 5Gపై భారీ డీల్ తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.30,999. అయితే సేల్‌లో రూ.5 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

కిక్‌స్టార్టర్ డీల్‌లో ఫోన్‌పై రూ. 1550 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 27,750 తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

Samsung Galaxy A35 5G Features
కంపెనీ ఈ ఫోన్‌లో 2340x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ Samsung ఫోన్ 8 GB RAM+ 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో Mali-G68 MP5 GPUతో Exynos 1380 చిప్‌సెట్‌ను అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు అందించబడ్డాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం మీరు ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు.

ఫోన్‌ను పవర్ చేయడానికి 5000mAh బ్యాటరీ ఉంది.ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 14 ఆధారంగా Samsung One UI 6.1లో పని చేస్తుంది. IP67 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉన్న ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో వస్తుంది. ఇది బయోమెట్రిక్ భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Tags:    

Similar News