Alert WiFi Users: వైఫై వాడుతున్నారా.. ఈ మార్పులు చేయకుంటే చాలా నష్టపోతారు..!
Alert WiFi Users: ఈ రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ పెరగడం వల్ల చాలామంది ఇళ్లలో వైఫై వాడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు ఇలా చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
Alert WiFi Users: ఈ రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ పెరగడం వల్ల చాలామంది ఇళ్లలో వైఫై వాడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు ఇలా చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వైఫై వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటా దొంగిలించి బ్యాంక్ అకౌంట్‌లో ఉండే డబ్బులు మొత్తం కాజేస్తారు. ఐపీ నెంబర్‌ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైఫై పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా వైఫై, అడ్మిన్ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి. కొత్త రూటర్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పుడల్లా కొత్త పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోవాలి. పాత పాస్‌వర్డ్ సురక్షితం కాకపోవచ్చు. ఎప్పుడు కఠినమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. సాధారణ పాస్‌వర్డ్‌లను నివారించాలి. ఎందుకంటే తరచుగా ఇవి హ్యాక్ అవుతాయని గుర్తుంచుకోండి. అలాగే వైఫై పేరును కూడా మార్చండి. రూటర్ డిఫాల్ట్ పేరును మార్చండి. ఎందుకంటే డిఫాల్ట్ పేరు చాలా సాధారణంగా ఉంటుంది. హ్యాకర్లు సులభంగా తెలుసుకుంటారు. క్రమం తప్పకుండా సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాలి. కొత్త అప్‌డేట్‌తో మెరుగైన భద్రతను పొందుతారు. వైఫై వాడనప్పుడు రూటర్‌ను ఆఫ్ చేయాలి. దీంతో వై-ఫైపై హ్యాకర్లు దాడి చేసే అవకాశం తక్కువగా ఉంటుంది.
పాస్వర్డ్ మార్చడం ఎలా?
- ముందుగా ఫోన్ కానీ డెస్క్‌టాప్‌లో కానీ వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు మీ IP చిరునామాను టైప్ చేయండి.
- కంటిన్యూపై క్లిక్ చేయండి. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- వైర్‌లెస్ సెట్టింగ్‌లకు వెళ్లి పాస్‌వర్డ్ ప్రాంతంలో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఈ విధంగా పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
రూటర్ పేరు మార్చడం ఎలా?
- ముందుగా రూటర్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
- తర్వాత వైర్‌లెస్ సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు నెట్‌వర్క్ పేరు (SSID)కి వెళ్లి క్లిక్ చేయాలి.
- తర్వాత రూటర్ పేరును సులభంగా మార్చవచ్చు.