Airtel Jio: ఎయిర్‌టెల్‌, జియో కస్టమర్లకి బ్యాడ్ న్యూస్‌.. ఇక ప్లాన్‌లు చాలా ఖరీదు..!

Airtel Jio: టెలికాం కంపెనీలు కొత్త సంవత్సరంలో కస్టమర్లకు పెద్ద షాక్‌ ఇవ్వనున్నాయి.

Update: 2022-12-23 13:30 GMT

Airtel Jio: ఎయిర్‌టెల్‌, జియో కస్టమర్లకి బ్యాడ్ న్యూస్‌.. ఇక ప్లాన్‌లు చాలా ఖరీదు..!

Airtel Jio: టెలికాం కంపెనీలు కొత్త సంవత్సరంలో కస్టమర్లకు పెద్ద షాక్‌ ఇవ్వనున్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఎయిర్‌టెల్, జియో ఇతర టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతాయని సూచిస్తున్నాయి. ఇదే జరిగితే మీరు మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

2023, 2024, 2025 నాలుగో త్రైమాసికంలో సుంకాల పెరుగుదల కనిపించవచ్చని తెలుస్తోంది. అంటే వచ్చే ఏడాది మాత్రమే కాదు, ఇంకా చాలా ఏళ్ల పాటు మొబైల్ వినియోగదారుల జేబులపై భారం పడుతూనే ఉంటుంది. అయితే ఈ టారిఫ్ ప్లాన్‌ల హైక్‌ వెనుక కారణం ఏంటని అందరు ఆలోచిస్తున్నారు. మార్జిన్, రాబడిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కంపెనీలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించవచ్చని పలువురు భావిస్తున్నారు.

ఎయిర్‌టెల్ తన ప్లాన్‌ల ధరలను క్రమంగా పెంచింది. కొంతకాలం క్రితం కంపెనీ తన చౌకైన ఎయిర్‌టెల్ 99 ప్లాన్‌ను తీసివేసింది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను విత్‌ డ్రా చేసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. దీని ధరను 57 శాతం పెంచారు. అంటే రూ.155. చేశారు. ఈ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు 1 GB డేటా, 24 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ కొన్ని సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. 5G స్పెక్ట్రమ్ పొందడానికి రెండు కంపెనీలు చాలా డబ్బు ఖర్చు చేశాయి. ఇప్పుడు రెండు కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడం వల్ల డబ్బును రికవరీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News