5G మొదటి దశలో 600 Mbps స్పీడ్.. ఫోన్ ఎలా పనిచేస్తుందంటే..?
5G Network: 5Gని ప్రవేశపెట్టిన మొదటి దశలో కస్టమర్‌లు సెకనుకు 600 మెగాబిట్ల వేగం పొందుతారు.
5G Network: 5Gని ప్రవేశపెట్టిన మొదటి దశలో కస్టమర్‌లు సెకనుకు 600 మెగాబిట్ల వేగం పొందుతారు. యాప్‌ని యాక్సెస్ చేయడంలో 'డేటాను ప్రాసెస్ చేయడం'లో ప్రొఫెషనల్ కంప్యూటర్‌లు చేసే విధంగానే మొబైల్ ఫోన్ పని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో కొన్ని నగరాలలో 5జి సేవలని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
5G సేవలను పొందేందుకు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నగరం 'నెట్‌వర్క్ కవరేజీ' పూర్తయ్యే వరకు 'బీటా ట్రయల్' కింద 5G సేవల ప్రయోజనాన్ని కొనసాగిస్తామని రిలయన్స్ జియో తెలిపింది. సెకనుకు ఒక గిగాబిట్ (Gbps) వేగంతో అపరిమిత 5G ఇంటర్నెట్‌ను అందిస్తామని తెలిపింది. అయితే మొబైల్ స్టేషన్లకు అతి సమీపంలో ఈ స్థాయి వేగం అందుబాటులో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇలా ఫోన్ లో సెట్టింగ్ చేసుకోవాలి
5G హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసిన వారు లేదా 5G హ్యాండ్‌సెట్‌ను కలిగి ఉన్న కస్టమర్‌లు నెట్‌వర్క్ సెట్టింగ్‌లలో 5G ఎంపికను చూస్తారు. సేవను పొందేందుకు ఈ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. కస్టమర్ ప్రాంతంలో 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి హ్యాండ్‌సెట్‌లోని మొబైల్ నెట్‌వర్క్ డిస్‌ప్లే 4Gకి బదులుగా 5Gని చూపిస్తుంది. 5G సేవలని ఒక సర్కిల్‌లో ప్రారంభించిన తర్వాత టెలికాం కంపెనీలు తన టారిఫ్ రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. 5జీ సేవల ధరలు దేశాన్ని బట్టి మారుతాయి. కొన్ని దేశాలు 5G కోసం ప్రత్యేక రుసుమును వసూలు చేయవు. మరి కొందరు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు.