IPL 2021: సన్‌రైజర్స్‌ ఆ తప్పు చేయకపోతే ఫలితం మరోలా ఉండేదా..?

IPL 2021: ఆఫ్గాన్ ఆల్ రౌండర్ నబీ స్థానంలో కేన్‌ విలియమ్స్ ఆడించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని చర్చించుకుంటున్నారు.

Update: 2021-04-12 05:21 GMT

కేన్, నబీ ఫైల్ ఫోటో 

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ సన్‌రైజర్స్ ఆకట్టుకుందనే ప్రదర్శన చేసింది‌. చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా... రసెల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 11 పరుగులే ఇచ్చాడు. 10 పరుగుల తేడాతో ఓటమి పాలవడం అభిమానుల్ని బాధించింది. సన్‌రైజర్స్ ఓటమిపై నెట్టింట్లో అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కేన్‌ విలియమ్సన్‌ను తీసుకోకపోవడం వల్లే ఓటమి చెందామని పోస్ట్ చేస్తున్నారు.

అయితే కోల్‌కతాలో మ్యాచ్‌ ఆరంభమైన దగ్గర్నుంచీ కేన్‌ మామ ఎక్కడ అని అభిమానులు సోష‍ల్‌ మీడియా పోస్ట్ చేశారు. కేన్ పక్కన పెట్టి ఆరేంజ్ ఆర్మీ తప్పు చేసిందా?బౌలింగ్ లో విఫలం అయ్యిందా? చూద్దాం. తొలి మ్యాచ్‌లో నబీ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, రసీద్‌ ఖాన్‌ బౌలర్లు ఉన్నారు. విజయ్‌ శంకర్‌ లాంటి ఆల్ రౌండర్ రూపంలో ఉండగా.. నబీకి చోటివ్సాల్సిన ఏంటి అనే ప్రశ్న తలేత్తుతుంది.

విదేశీ ప్లేయర్ల కోటాలో ఆఫ్గాన్ ఆల్ రౌండర్ నబీ స్థానంలో కేన్‌ విలియమ్స్ ఆడించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని చర్చించుకుటున్నారు. నబీ బౌలింగ్ లో అద్బుతంగా రాణించాడు. 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి 32 పరుగులిచ్చాడు. బౌలర్‌గా రాణించినా బ్యాట్‌తో విఫలమైయ్యాడు. 11 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 14పరుగులు మాత్రమే చేసిన ప్రసిద్ధ్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. రావడంతోనే నబీ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడే తప్ప వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టాలనే ఆలోచన చేయలేదు. సన్ రైజర్స్ నబీ స్థానంలో కేన్‌ తీసుకుని ఉంటే సునాయాసంగా విజయం సాధించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో వార్నర్‌ విఫలం కావడం, కేన్‌ లేకపోవడమే ఓవరాల్‌గా వారి ఓటమిపై ప్రభావం చూపించిందని క్రీడా అభిమానులు అంటున్నారు.

అయితే సన్‌రైజర్స్ ప్రధాన బలం బౌలింగ్.. గత కొన్ని సీజన్లుగా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌లో రాణిస్తుంది. ఆరెంజ్ ఆర్మీని అత్యధిక మ్యాచుల్లో బౌలర్లే గెలిపించారు. అలానే ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి అలవొకగా విజయం సాధిస్తుంది. అదే వ్యూహాంతో తొలుత టాస్ గెలిచిన వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై పరుగుల వరద పారడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు ఇన్ని పరుగులు ఈ వికెట్‌పై వస్తాయని అనుకోలేదన్నాడు. 'పరుగులు భారీగా వచ్చాయి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.

వార్నర్ చెప్పిన దాని బట్టి చూస్తే.. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, రసీద్‌ ఖాన్‌,మ‌హ్మద్ నబీ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉన్న సన్ రైజర్స్ 187 పరుగలు అప్పలంగా ఇచ్చిందంటే ఆశ్చర్యమే. సన్ రైజర్స్ నబీని తీసుకుంటే అది కూడా ఆల్ రౌండర్ రూపంలో తీసుకుని ఉంటుంది. టీ20ల్లో నబీ ట్రాక్ రికార్డు అద్భంతంగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో భువి, నటరాజన్, సందీప్‌ శర్మ, విజయ్ వంటి టాప్ బౌలర్లు పూర్తిగా విఫలమైయ్యారు. వీరు నలుగురు కలిసి 131 పరుగులు ఇచ్చారు. ఒక నబీ, రషీద్ పొదుపుగా బౌలింగ్ చేసి 56 పరుగులు మాత్రమే ఇచ్చారు. భువి, నట్టు కూడా రాణించి ఉంటే కోల్‌కతా అన్ని పరుగులు చేసి ఉండేది కాదు. ఇలా చూస్తే సన్ రైజర్స్ యాజమాన్యం ఆలోచన సరైందే అనిపిస్తుంది. వార్నర్ తోడుగా బెయిర్ స్టో ఓపెనర్ గా దిగితే పరిస్థితి మరోలా ఉండేదని, సాహా ని నాలుగో స్థానంలో పంపిస్తే బాగుండేదని కొందరూ అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓపెనర్ గా వచ్చిన అనుభవం బెయిస్టోకి ఉందని అంటున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో చేతిలో 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్‌ రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే పరిమితం అయ్యింది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయన్ని చేకూర్చలేకపోయారు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (8 బంతుల్లో 19నాటౌట్‌; 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. రసెల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 11 పరుగులే ఇచ్చాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కమిన్స్‌, షకీబుల్, రస్సెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News