IND vs BAN: కాన్పూర్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే మోత మోగాల్సిందే..!

India Records in Kanpur: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా శుభారంభం చేసి తొలి మ్యాచ్‌లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Update: 2024-09-25 05:11 GMT

IND vs BAN: కాన్పూర్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే మోత మోగాల్సిందే..!

India Records in Kanpur: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా శుభారంభం చేసి తొలి మ్యాచ్‌లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ తొలి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఇప్పుడు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌పై జట్టు దృష్టి సారించింది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. కాన్పూర్‌లో టీమిండియా టెస్టు చరిత్రను ఒకసారి చూద్దాం.

కాన్పూర్‌లో భారత్‌ రికార్డు ఎలా ఉంది?

1952లో కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే, తొలి రెండు టెస్టుల్లో భారత్‌ ఓడిపోయింది. మొదట ఇంగ్లండ్‌, ఆ తర్వాత వెస్టిండీస్‌పై ఓడింది. ఇప్పటి వరకు ఈ మైదానంలో భారత్ 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 7 విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. అదే సమయంలో, 13 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, వెస్టిండీస్ 2, ఇంగ్లండ్‌ జట్టు 3 మ్యాచ్‌లు గెలిచాయి.

గత 7 మ్యాచ్‌ల రికార్డులు..

ఇక ఈ మైదానంలో ఆడిన గత 7 టెస్టు మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే.. అందులో 5 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరిసారిగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్‌ ఈ మైదానంలో భారత్‌తో ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ తలపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఈ గడ్డపైనే టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి.

ఇక్కడ టాప్ 5 రన్ స్కోరర్లు..

గుండప్ప విశ్వనాథ్ - 776 పరుగులు

సునీల్ గవాస్కర్ - 629 పరుగులు

మహ్మద్ అజారుద్దీన్ - 543 పరుగులు

కపిల్ దేవ్ - 430 పరుగులు

దిలీప్ వెంగ్‌సర్కార్ - 422 పరుగులు

టాప్-5 వికెట్ టేకర్స్..

కపిల్ దేవ్ - 25 వికెట్లు

అనిల్ కుంబ్లే - 21 వికెట్లు

హర్భజన్ సింగ్ - 20 వికెట్లు

సుభాష్ గుప్తే - 19 వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్ - 16 వికెట్లు

Tags:    

Similar News