Shiva Puja: శ్రావణంలో ఈ విధంగా శివుడిని పూజించండి.. ఈ ఫలితాలని పొందండి..!

Shiva Puja: హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో శివారాధన చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.

Update: 2023-08-04 02:09 GMT

Shiva Puja: శ్రావణంలో ఈ విధంగా శివుడిని పూజించండి.. ఈ ఫలితాలని పొందండి..!

Shiva Puja: హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో శివారాధన చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. దేవతల దేవుడైన మహా దేవుడికి ఇష్టమైన రోజు సోమవారం. అందుకే శ్రావణంలో వచ్చే సోమవారాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు శివపూజ చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఎవరైతే సోమవారం శివుడిని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే శివపూజ చేసే విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం శివుడిని ఆరాధిస్తారు. అయితే మీ రాశి ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలలో పూజ చేస్తే మరింత పుణ్యఫలం పొందవచ్చు. శివపూజ చేసేటప్పుడు శరీరం, మనస్సు పవిత్రంగా ఉండాలి. ఇంట్లో గంగాజలం, పచ్చి పాలు, పువ్వులు, బేల్పత్రం, శమీపత్రం, భస్మం మొదలైన వాటిని మహాదేవుడికి సమర్పించి ఉపవాసం చేయాలి. తర్వాత శివుడి గుడికి వెళ్లి మీ రాశి ప్రకారం మంత్రాలను జపించాలి. సోమవారం పూజ పుణ్యాన్ని పొందడానికి రుద్రాష్టకం, శివ మహిమ్న స్తోత్రం, శివ తాండవ స్తోత్రాలను పఠించవచ్చు. తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో దీపం హారతి చేయాలి.

మేషరాశి వారు శివుడిని పూజిస్తూ 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి వారు ద్వాదశ జ్యోతిర్లింగ మంత్రాన్ని జపించాలి. కర్కాటక రాశి వారు 'ఓం చంద్రమౌళీశ్వర్ నమః' అనే మంత్రాన్ని జపించాలి. కన్యా రాశి వారు శివుని అనుగ్రహం పొందడానికి 'ఓం నమో శివాయ కాలన్ ఓం నమః' అనే మంత్రాన్ని పఠించాలి. తులారాశి వారు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించి దేవతలకు అధిపతి అయిన శివుడిని పూజించిన పుణ్యాన్ని పొందాలి.

Tags:    

Similar News