Marriage Remedies: వివాహం ఆలస్యం అవుతుంది.. జ్యోతిష్యం ప్రకారం ఈ పద్ధతులు పాటించండి..!

Marriage Remedies: ఈ రోజుల్లో చాలామందికి సరైన వయసులో వివాహం అవడం లేదు. లేట్‌ మ్యారేజెస్‌ వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు.

Update: 2024-02-14 01:30 GMT

Marriage Remedies: వివాహం ఆలస్యం అవుతుంది.. జ్యోతిష్యం ప్రకారం ఈ పద్ధతులు పాటించండి..!

Marriage Remedies: ఈ రోజుల్లో చాలామందికి సరైన వయసులో వివాహం అవడం లేదు. లేట్‌ మ్యారేజెస్‌ వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. పిల్లల పెళ్లిళ్లు కావడం లేదని ఇంట్లో తల్లిదండ్రులకు ఆందోళన పెరుగుతుంది. చాలామంది ఉద్యోగం సాధించి జీవితంలో సెటిల్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామనే భావనలో ఉంటున్నారు. పెద్దలు ఇది సరైన పద్దతి కాదని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెబుతున్నారు. వివాహం ఆలస్యమైతే జ్యోతిష్యం ప్రకారం కొన్నిరెమిడీస్‌ చేయాలి. దీనివల్ల దోశాలు తొలగిపోయి తొందరగా పెళ్లి జరుగుతుంది.

వివాహ ప్రక్రియలో ఆటంకాలు ఎదురైతే ఇంట్లోని నైరుతి ప్రదేశంలో ప్రతిరోజూ సాయంత్రం మల్లెపూల నూనెతో దీపం వెలిగించాలి. శుక్రవారం రోజున ఒక అంధుడికి సువాసనతో కూడిన వస్తువు లేదా పెర్ఫ్యూమ్ లాంటివి దానం చేయాలి. మార్కెట్ నుంచి రెండు ముత్యాలను తీసుకొచ్చి ఒకదానిని ఏడుసార్లు తిప్పి ప్రవహించే నదిలో వేయాలి. రెండోది ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. గురువారం రోజు రెండు యాలకులు, ఐదు రకాల మిఠాయిలను ఒక పాత్రలో ఉంచి నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించాలి. ఈ పరిహారం వరుడు చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుంది.

అలాగే పెళ్లి సమయంలో అమ్మాయి చేతులకు మెహందీ వేసిన తర్వాత పెళ్లికాని అమ్మాయి తన చేతులకు మెహందీ రాసుకుంటే ఆమె వివాహం త్వరగా పూర్తవుతుంది. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల గది ఇంటికి ఎల్లప్పుడూ వాయవ్య దిశలోనే ఉండాలి. ఒకవేళ ఈ దిశలో లేకపోతే పశ్చిమ దిశ కూడా మంచిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు గది ఇంటికి నైరుతి భాగంలోనే ఉండాలి. ఎందుకంటే నైరుతి మూల స్థిరత్వం ఉంటుంది. వివాహం కావాల్సిన వారికి మాత్రం నైరుతి దిశ అనుకూలం. ఒకవేళ అబ్బాయిలకు వివాహం చేయాలనుకుంటే వారి గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కులో ఉండాలి.

Tags:    

Similar News