Peepal Tree: రావిచెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయడంపై ఆంతర్యం ఏమిటీ.. శాస్త్రీయ కోణం తెలుసుకోండి..!

Peepal Tree: హిందూ మతంలో కొన్ని రకాల చెట్లకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో తులసి, వేప, మర్రి, రావిచెట్లని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

Update: 2023-07-19 03:14 GMT

Peepal Tree: రావిచెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయడంపై ఆంతర్యం ఏమిటీ.. శాస్త్రీయ కోణం తెలుసుకోండి..!

Peepal Tree: హిందూ మతంలో కొన్ని రకాల చెట్లకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో తులసి, వేప, మర్రి, రావిచెట్లని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సంప్రదాయం ప్రకారం వీటికి పూజలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఆలయాల్లో రావిచెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయడం, దీపాలు వెలిగించడం చాలామంది చూసే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే రావిచెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. ఈ చెట్టుని పూజించడం వల్ల జీవితంలో ధనప్రాప్తి, ఆనందం కలుగుతుందని నమ్మకం. అలాగే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రావి చెట్టు శాస్త్రీయ ప్రాధాన్యత

రావిచెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు శాస్త్రీయంగా కోణం కూడా దాగి ఉంది. ఇది మానవులకు అవసరమైన ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదరక్షిణలు చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ఇది శరీరంలోని పిత్త, వాతాన్ని సమతుల్యం చేస్తుందని చెబుతారు.

రావిచెట్టు మతపరమైన ప్రాధాన్యత

హిందూ మతం ప్రకారం రావి చెట్టుని దేవతల నివాసంగా చెబుతారు. ఇందులో శని దేవుడు కూడా ఉంటాడు. అందుకే ఈ చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించడం వల్ల శనిదేవుడు సంతోషించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. అలాగే జాతకంలో ఉన్న శనిదోషం పోవాలంటే అమావాస్య వచ్చే శనివారం రోజు రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయాలని నియమం ఉంది. ఆవనూనెతో దీపం వెలిగించడం శుభప్రదమని చెబుతారు.

మానసిక ప్రశాంతతను

రావిచెట్టు మానసిక ప్రశాంతతని అందిస్తుందని పెద్దల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు ఆలోచనలు మనస్సులోకి రావు. మరోవైపు రావి చెట్టును ప్రతిరోజూ ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.

Tags:    

Similar News