Vastu Tips: వాస్తు పూజకు, శాంతి పూజకు తేడాలేంటి.. ఎప్పుడు చేస్తే ఫలితాలు ఉంటాయి..!
Vastu Tips: చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా స్థలం కొన్నప్పుడు కొన్ని రకాల పూజలు నిర్వహిస్తారు. అందులో వాస్తు పూజలు, శాంతి పూజలు ఉంటాయి. చాలా మందికి ఈ రెండు పూజల మధ్య తేడా తెలియదు.
Vastu Tips: చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా స్థలం కొన్నప్పుడు కొన్ని రకాల పూజలు నిర్వహిస్తారు. అందులో వాస్తు పూజలు, శాంతి పూజలు ఉంటాయి. చాలా మందికి ఈ రెండు పూజల మధ్య తేడా తెలియదు. కొంతమంది ఈ రెండు ఒకే రకమైనవని భావిస్తారు. కానీ ఈ రెండు పూజలు వేరు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి. ఈ రెండు పూజల గురించి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వాస్తు పూజ ఎప్పుడు చేస్తారు?
వాస్తవానికి ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని కలిగి ఉండాలని కలలు కంటారు. ఈ కల నెరవేరినప్పుడు దేవతల ఆశీర్వాదం పొందడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇందుకోసం వాస్తు పూజ చేస్తారు. కొత్త ఇల్లు, కార్యాలయం, వ్యాపార సంస్థను కొనుగోలు చేసేటప్పుడు అనేక రకాల వాస్తు నియమాలను పాటించాలి. తద్వారా భవిష్యత్తులో ఈ ప్రదేశం నుంచి మనం ప్రయోజనాలను పొందుతాము. అయితే అన్నీ చూసుకున్న తర్వాత కూడా తెలిసి తెలియక ఏదో ఒక వాస్తు దోషం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు హవన-పూజ, నవగ్రహ మండల పూజ చేస్తారు. దీన్ని వాస్తు పూజ అంటారు. వాస్తు పూజను శుభ సమయంలో నిర్వహిస్తారు.
వాస్తు శాంతి పూజ అంటే..?
వాస్తు పూజ లాగానే వాస్తు శాంతి పూజ కూడా చేస్తారు. నిజానికి వాస్తు శాస్త్రంలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆకాశం, భూమి, నీరు, అగ్ని, గాలి అనేవి పంచభూతాలు.ఈ ఐదు అంశాలు అన్ని దిశల వ్యాపించి ఉంటాయి. వీటిని శాంతింప చేయడం ద్వారా అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. పాత ఇల్లు, కార్యాలయంలో వాస్తు దోషాలను తొలగించడానికి శాంతి పూజ చేస్తారు.