Adhika Sravana Masam 2023: శ్రావణమాసానికి, అధిక శ్రావణ మాసానికి తేడా ఏంటి? శుభ కార్యాలు ఎప్పుడు చేస్తే మంచిది?
Adhika Sravana Masam 2023: ఆషాడం ముగిసిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. అయితే, ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం వచ్చింది.
Adhika Sravana Masam 2023: ఆషాడం ముగిసిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. అయితే, ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం వచ్చింది. అసలు అధిక శ్రావణమాసం అంటే ఏమిటి? శ్రావణమాసానికి అధిక శ్రావణ మాసానికి అసలు తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం శివునికి అంకితం చేసిన నెలగా పేర్కొంటున్నారు. గ్రంధాలలో ఈ మాసాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ మాసంలో శివుని ప్రత్యేక ఆరాధనతో పాటు, శ్రావణ మాసం సోమవారాల్లో ఉపవాసం చేసే ధోరణి కూడా ఉంది. అయితే ఈసారి శ్రావణం ఒకటి కాదు రెండు నెలలు ఉంటుంది. అధిక మాసం కారణంగా శ్రావణ మాసం జులై నుంచి ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. శ్రావణ మాసం మాసానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది..
తెలుగు పంచాంగం ప్రకారం సౌరమాన సంవత్సరానికి, చాంద్రమాన సంవత్సరానికి 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడానే 3 ఏళ్లకు చూస్తే 30 రోజులు సౌరమాన సంవత్సరానికి ఎక్కువ ఉంటుంది. ఈ 30 రోజులనే అధికమాసంగా పరిగణిస్తుంటారు. 3ఏళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. అయితే, ఈ శ్రావణమాసానికి ఈ అధికమాసం తోడవడం 19 సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది కూడా అధిక శ్రావణ మాసం వచ్చింది.
2023 సంవత్సరంలో, శ్రావణ మాసం జులై 4న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ఇందులో అధిక శ్రావణ మాసం జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకు ఉంటుంది. ఆ తర్వాత అసలైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ విధంగా శ్రావణ మాసం 58 రోజులు ఉంటుంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన జరగడం విశేషం.
4 లేదా 5 కాదు శ్రావణంలో 8 సోమవారాలు..
శ్రావణ మాసం సోమవారాలలో ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణిస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 4 లేదా 5 సోమవారాలు ఉంటాయి. కానీ, ఈసారి శ్రావణ మాసంలో సోమవారాలు 4 లేదా 5 కాదు ఏకంగా 8 సోమవారాలు వస్తాయి. జులైలో 4 సోమవారాలు, ఆగస్టు నెలలో 4 వస్తున్నాయి. ఈ సోమవారాలు జులై 10, 17, 24, 31 వస్తున్నాయి. ఆగస్టు 7, 14, 21, 28 తేదీలలో వస్తుంటాయి.
శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏమిటి?
శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. ఈ మాసంలో ఆచారాలతో పూజిస్తే, శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు. శివ భక్తులందరూ తమ కోర్కెలు నెరవేరాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఈ మాసం శివునికి ఎందుకు ప్రియమైనది..
దక్షుని కుమార్తె సతి తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు, మహాదేవుడు చాలా బాధపడ్డాడని, అతను తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడని చెబుతుంటారు. అప్పుడు పార్వతి మాతా సతి నుంచి పర్వతరాజ్ హిమాలయ కుమార్తెగా పార్వతిగా జన్మించింది. మహాదేవుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. అతని తపస్సుకు సంతోషించిన మహాదేవుడు తన కోరికను నెరవేర్చాడు. ఆ తర్వాత మాత్రమే మహాశివరాత్రి నాడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా ఈ మాసాన్ని పరమశివుడు, పార్వతీమాత కలిసిన మాసంగా భావిస్తారు. అందుకే ఈ మాసం శివునికి, గౌరీకి ప్రీతికరమైనది చెబుతుంటారు.
శ్రీ మహావిష్ణువుకు శ్రావణమాసం ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు. ఈ సమయంలో దైవ కార్యాలకు అధిక ఫలాలు ఉంటాయని చెబుతుంటారు. దానాలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక సేవలు చేయడంతో రెట్టింపు ఫలితాలను ఇస్తుంటాయి. అధికమాసంలో నిజశ్రావణ మాసంలా గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ఉపనయనాలు వంటివి పాటించ కూడదు. ఆధ్యాత్మికవేత్తలకు ఆధ్యాత్మిక ధోరణితో ఉండేవారికి ఈ అధికమాసాన్ని ప్రత్యేక మాసంగా చెబుతుంటారు. ఈ మాసంలో ఎక్కువగా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పెద్దలు చెబుతున్నారు.