Kaal Sarpa Dosha: కాలసర్ప దోషం అంటే ఏమిటి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిష్కారం తెలుసుకోండి..!

Kaal Sarpa Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతక ప్రభావం, పాప పుణ్యాలు, కర్మ ఫలితాలని బట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2023-08-08 14:30 GMT

Kaal Sarpa Dosha: కాలసర్ప దోషం అంటే ఏమిటి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిష్కారం తెలుసుకోండి..!

Kaal Sarpa Dosha: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతక ప్రభావం, పాప పుణ్యాలు, కర్మ ఫలితాలని బట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో అతి ప్రధానమైన సమస్య కాల సర్పదోషం. దీనివల్ల పూర్వ జన్మ కర్మ ఫలితాలని ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము మానవుని జాతక చక్రములో రాహువు, కేతువు గ్రహాల మధ్య ఎలాంటి గ్రహాలు లేకపోతే దానిని కాలసర్ప దోషము అంటారు. దీనివల్ల జీవితంలో ఒక్క పనిలో కూడా విజయం సాధించలేరు. ఈ దోషాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

కాలసర్ప దోషం సమస్యలు

కాలసర్ప దోష ప్రభావము వల్ల ఆ వ్యక్తులకి జీవితములో ప్రతీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వివాహము ఆలస్యమవుతుంది. ఒకవేళ వివాహము అయినా వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని సందర్భాలలో మూర్ఖంగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాల సర్ప దోషము వారి జాతకములో ఉన్న స్థానాన్ని బట్టి శారీరక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఏర్పడుతాయి.

కాలసర్ప దోష పరిహారాలు

కాలసర్ప దోషం ఉన్న జాతక వ్యక్తులు ప్రతీ నిత్యం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి. పేరులో నాగ లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అభిషేకాలు, హోమాలు చేయాలి. జాతకములో తీవ్రమైన కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగ ప్రతిష్ట చేయించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కాలసర్ప దోషము వల్ల వైవాహిక జీవితములో సమస్యలు ఉన్న వారు రాహువు కేతువులకు శాంతులు, హోమాలు చేయాలి. అలాగే మంగళవారం కుజ గ్రహాన్ని పూజించాలి. శనివారం రాహువు, కేతువులను పూజించాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల కొంత దోష పరిహారం జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News