శ్రీవారి భక్తులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు : టీటీడీ చైర్మన్ & ఈఓ

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు, యాత్రికుల‌కు, టీటీడీ ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2019-10-25 11:17 GMT

                                                (తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు, యాత్రికుల‌కు, టీటీడీ ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని శుక్ర‌వారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఛైర్మన్‌, ఈవో కోరారు. టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి కూడా భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు, ఉద్యోగుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Tags:    

Similar News