Mercury Transit 2023: వృషభరాశిలో బుధుడి సంచారం.. ఈ 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు..!
Mercury transit astrology: బుధ గ్రహం రాశిచక్రాలను మార్చినప్పుడల్లా, అది కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
Mercury transit astrology: ప్రతి నెలా గ్రహాల కదలికలు మారుతూనే ఉంటాయి. ఈ నెలలో కూడా చాలా ముఖ్యమైన గ్రహాల గమనం జరగబోతోంది. ఈ గ్రహాలలో బుధుడు కూడా ఒకటి. జూన్ 7వ తేదీ రాత్రి 7.40 గంటలకు బుధుడు వృషభ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ రాశి మార్పు శుక్రుని రాశిలో జరుగుతుంది. దీంతో ఈ రెండు రాశులు మంచి స్నేహితులుగా మారుతారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ మార్పు చాలా కీలకంగా ఉంటుంది. ఈ సంచారం 5 రాశులపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఈ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. దీంతో వీరి కెరీర్ చాలా దూసుకపోతుంది.
వృషభం..
వృషభ రాశి వారికి ఈ బుధ సంచారం ఆహ్లాదకరమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా డబ్బు, వృత్తి రంగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో, భారీ లాభాలు ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మేధస్సు పదునుగా ఉంటుంది. దీని కారణంగా ప్రతి పనిలో విజయం దక్కుతుంది.
కర్కాటక రాశి ..
మెర్క్యురీ ఈ సంచారం పని రంగంలో కొత్త అవకాశాలను తెస్తుంది. దీంతో పెద్ద లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి శుభ సమయం అవుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ సంబంధాలు వృద్ధి చెందుతాయి.
కన్య రాశి..
కన్యారాశి వారికి వృషభరాశిలో బుధుని ప్రవేశం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో కెరీర్‌కు సంబంధించి గొప్ప అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగంలో ఆ అవకాశాలు ఈ కాలంలోనే లభిస్తాయి. వ్యాపారులకు లాభిస్తుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది.
మకరరాశి..
మకరరాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నవి దక్కించుకోగలరు. అదృష్ట మద్దతుతో ధనలాభం ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి అన్వేషణ పూర్తవుతుంది. ఈ మార్పు ఆర్థిక విషయాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి.
మీనరాశి..
మీన రాశి వారికి బుధ గ్రహం మార్పు శుభవార్త తెస్తుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. ధనలాభంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సోషల్ మీడియాలో ఉన్న విషయాలను జోడించి అందించాం. HMTV దీనిని ధృవీకరించలేదు. ఏదైనా పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.)