Tortoise Enters into Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం ...

Tortoise Enters into Chilkur Balaji Temple: హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ప్రసిద్ధికెక్కిన చిలుకూరు బాలాజి దేవాలయంలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2020-07-19 18:25 GMT
Tortoise Enters into Chilkur Balaji Temple

Tortoise Enters into Chilkur Balaji Temple: హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ప్రసిద్ధికెక్కిన చిలుకూరు బాలాజి దేవాలయంలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న శివాలయంలో ఆదివారం తెల్లవారు జామున ఒక తాబేలు ఎక్కడి నుంచో ప్రవేశించి దర్శనమిచ్చింది. లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా ఆలయంలోకి తాబేలు రావడంతో అర్చకులను విస్మయానికి గురయ్యారు. ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులు మూసివేసినా అసలు తాబేలు ఎలా ప్రవేశించిందన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది.

ఇక ఈ ఆలయంలోకి తాబేలు ప్రవేశించిన విషయాన్ని పూజారి సురేశ్ గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు మాట్లాడుతూ తాబేలు ఆలయంలోకి ప్రవేశించడానికి చిన్న మార్గం కూడా లేకపోయినా అది ఏ విధంగా లోపలికి ప్రవేశించిందో తెలియదని, ఇలా ప్రవేశించడం ఓ అద్భుతం అని తెలిపారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువే ఆలయంలోకి వచ్చారని ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందని అన్నారు. పూర్వం క్షీరసాగర మథనం చేసే సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తారని తెలిపారు. పాల సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీయడానికి మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు మదించారు. అయితే మేరు పర్వతం లోపలికి వెల్లకుండా క్షీరసాగర మథనం జరగడానికి మహావిష్ణువు కూర్మరూపం ఎత్తారని అన్నారు. ఇప్పుడు కూడా కరోనాపై విజయం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది. సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు మింగుతాడు అని తెలిపారు.

త్వరలోనే లోకం నుంచి ఈ వైరస్ అంతమై అమృతం లభిస్తుందని, ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడమే దీనికి నిదర్శనం అని తెలిపారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సూచిస్తున్నట్లుగా ఉందన్నారు. ఆరోగ్య సిబ్బంది సేవలు, భక్తులు చేసే ప్రార్థనలు, వైద్యులు, ప్రభుత్వం ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుంది' అని రంగరాజన్ అన్నారు.

ఇక ఈ తాబేలు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన పూజారి రంజరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉందని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం పేర్కొన్నారు. అంతేకాదు, ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని అన్నారు. 

Tags:    

Similar News