ఈరోజు నుంచి ధనుర్మాసం షురూ.. ధునుర్మాసంలో శ్రీవారి మేలుకొలుపు మారడానికి కారణాలు ఏంటి?

Dhanurmasam: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది.

Update: 2021-12-16 05:43 GMT

ఈరోజు నుంచి ధనుర్మాసం షురూ.. ధునుర్మాసంలో శ్రీవారి మేలుకొలుపు మారడానికి కారణాలు ఏంటి?

Dhanurmasam: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసం రాగానే కౌసల్యా సుప్రజా రామా.. పూర్వా సంధ్యా ప్రబద్దతే అనే మేలుకొలుపు వినిపించదు. దానికి బదులు గోదాదేవి పాడిన తిరుపావై పాశురాలు వినిపిస్తాయి. గోదాదేవి పాశురాలతోనే శ్రీవారిని మేలుకోల్పుతారు. ఇంతకీ గోదాదేవికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి? ధునుర్మాసంలో శ్రీవారి మేలుకొలుపు మారడానికి కారణాలు ఏంటి?

ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పూజా విధానాలు మారిపోతాయి. సుప్రభాత సేవతోకాకుండా గోదాదేవి పాశురాలతోనే శ్రీనివాసుడిని మేల్కోలుపుతారు. బుధవారం మ‌ధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి జనవరి 14వ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ 30 రోజుల పాటు తిరుప్పావై పాశురాలతోనే శ్రీవారికి మేల్కోలుపు చేయనున్నారు.

శ్రీవల్లి పుత్తూరులోని గోదాదేవి అమ్మవారికి అలంకరించి తీసిన పూలమాలను తమలపాకుల్లో చుట్టూ తిరుమలకు తీసుకువస్తారు. ఆ పూలమాలనే శ్రీవారి మూలమూర్తికి అలంకరిస్తారు. అలాగే ప్రతి రాత్రి ఏకాంత, పవళింపు సేవలను భోగ శ్రీనివాసుడికి బదులు శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు.

తమిళనాడు రాష్ట్రం శ్రీవల్లి పుత్తూరులో పూర్వం విఖానస బ్రహ్మణ కుటుంబానికి చెందిన అర్చకులైన విష్ణుచిత్తులు వారు రంగనాథుడికి నిత్య కైంకర్యాలు చేసేవారు. ఈ అర్చక దంపతులకు ఓ ఆడశిశువు జన్మించింది, లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి గోదాదేవిగా నామాకరణం చేశారు. గోదాదేవి అపారమైన భక్తిని ప్రేమగా భావించి రంగనాధుడిని భర్తగా భావించి ఆరాధించేది. గోదాదేవి తన చేతులతో పూలమాలను అల్లి ముందు తాను ధరించి ఆ తర్వాత స్వామివారికి అలంకరించేది.

విషయం తెలుసుకున్న గోదాదేవి తండ్రి ఆమెను మందలించడంతో ఆ చర్యను మానుకుంది. ఆ మరుసటి రోజు నుంచి స్వామివారి మూలవిరాటు తేజస్సు తగ్గుతూ వస్తుంది. గమనించిన గోదాదేవి తండ్రి తన పొరపాటు గమనించాడు. తన కూతురు సాక్షాత్తూ శ్రీనివాసుడిని సతేనని అనుకున్నాడు. మళ్లీ గోదాదేవి పూలమాలను తాను ధరించి, స్వామివారికి సమర్పించేంది.

అలా స్వామివారి సేవలో తరించిన గోదాదేవి పవిత్రమైన ధనుర్మాసంలో కఠోర దీక్ష చేసింది. రోజుకో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలతో స్వామివారిని కీర్తించింది. ఇక చివరిరోజు గోదాదేవి ఆ స్వామివారిలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుంచి తిరుమలలో ధనుర్మాసం రాగానే గోదాదేవి పాశురాలను వినిపిస్తూ గోదాదేవి పూలమాలను శ్రీవారికి సమర్పిస్తున్నారు.

Tags:    

Similar News