Ugadi 2024: ఉగాది నుంచి ఈ రాశుల వ్యాపారస్తులకు బంపర్​ ప్రయోజనాలు.. ఆ రాశులు వారు ఎవరంటే..?

Ugadi 2024: ఉగాది పండుగ వచ్చేసింది. క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ పచ్చడి తాగి పంచాంగ శ్రవణం చేస్తారు.

Update: 2024-04-09 03:02 GMT

Ugadi 2024: ఉగాది నుంచి ఈ రాశుల వ్యాపారస్తులకు బంపర్​ ప్రయోజనాలు.. ఆ రాశులు వారు ఎవరంటే..?

Ugadi 2024: ఉగాది పండుగ వచ్చేసింది. క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ పచ్చడి తాగి పంచాంగ శ్రవణం చేస్తారు. ఎవరి భవిష్యత్​ ఏ విధంగా ఉందో తెలుసుకుంటారు. రానున్న సంవత్సర కాలాన్ని గురించి ముందుగా తెలుసుకుని ఒక వార్షిక ప్రణాళిక వేసుకుంటారు. ఉగాది నుంచి పన్నెండు రాశుల జాతకాలు మారిపోతూ ఉంటాయి. ఈ రోజు నుంచి ఐదు రాశుల వ్యాపారస్తులకు కలిసి వచ్చే సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. ఆ రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మేష రాశి : క్రోధినామ సంవత్సరం ఈ రాశి వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. రెండు చేతులా సంపాదిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, టింబర్, ఐరన్, సిమెంట్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి : ఈ సంవత్సరం ఈ రాశి వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. కానీ బల్క్ ఇండస్ట్రీ వారికి సమస్యలు. చిట్స్, షేర్స్​లో డబ్బు ఆవిరి అవుతుంది.

తులా రాశి : క్రోధినామ సంవత్సరం తుల రాశి వారి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టు , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీపై చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కార్మికులు సమస్యల వలలో చిక్కకుండా ఉండాలి. కంప్యూటర్ రంగం వారికి ఉద్యోగ భద్రత చాలా తక్కువని గుర్తుంచుకోండి.

మకర రాశి : మకరరాశి వ్యాపారులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. శని అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. కాంట్రాక్టు పనులు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. బంగారం వ్యాపారులకు మొదటి ఆరు నెలలు కన్నా ఆ తర్వాత బాగుంటుంది. తొందరపాటుతనంతో ఆస్తులు కొనవలసి వచ్చి మానసికంగా ఇబ్బందులకు గురికాగలరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, ఎవరినీ బాధించకుండా జాగ్రత్తలు తీసుకొనగలరు. కోర్టు కేసులు రాజీ చేసుకోవడం ఉత్తమం.

మీన రాశి :ఈ ఉగాది నుంచి మీన రాశి వ్యాపారులకు అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ మీ సొంతం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు భారీగా లాభాలు ఆర్జిస్తారు. శని, గురుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర గ్రంథములు పఠించడం ఉత్తమం. 

Tags:    

Similar News