Vivah Muhurat 2024: ఒక నెలపాటు వివాహాలకు మంచి రోజులు లేవు.. వచ్చే ఏడాది మొత్తం 58 శుభ దినాలు..!

Vivah Muhurat 2024: ఈ ఏడాది మంచి రోజులు ముగిసాయి. పంచాంగం ప్రకారం డిసెంబర్ 16, 2023న సాయంత్రం 04:09 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశి నుంచి బయటకు వెళ్లి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.

Update: 2023-12-17 13:30 GMT

Vivah Muhurat 2024: ఒక నెలపాటు వివాహాలకు మంచి రోజులు లేవు.. వచ్చే ఏడాది మొత్తం 58 శుభ దినాలు..!

Vivah Muhurat 2024: ఈ ఏడాది మంచి రోజులు ముగిసాయి. పంచాంగం ప్రకారం డిసెంబర్ 16, 2023న సాయంత్రం 04:09 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశి నుంచి బయటకు వెళ్లి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఖర్మలు 15 జనవరి 2024న ముగుస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం 02:54 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే దాదాపు ఒక నెల రోజులు వివాహాలకు, శుభకార్యాలకు మంచి రోజులు లేవు.

జనవరి 15, 2024 నుంచి మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొత్త సంవత్సరం 2024లో 58 రోజుల వివాహ శుభ దినాలు ఉన్నాయి. వివాహాలకు అత్యంత అనుకూలమైన సమయం ఫిబ్రవరి, నవంబర్‌లలో ఉంటుంది. మే-జూన్‌లో వివాహానికి శుభ ముహూర్తాలు లేవు. అలాగే జూలై 16 నుంచి నవంబర్ 12 వరకు వివాహాలు జరగవు.

జనవరిలో మొత్తం 9 రోజులు, 16,17, 20, 21, 22, 27, 28, 30, 31

ఫిబ్రవరిలో 11 రోజులు, 4, 6, 7, 8, 12, 13, 17, 24, 25, 26, 29

మార్చిలో 10 రోజులు 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12

ఏప్రిల్ లో 6 రోజులు, 18, 19, 20, 21, 22

నవంబర్‌లో 11 రోజులు, 12, 13, 16, 17, 18, 22, 23, 25, 26, 28, 29

డిసెంబర్‌లో6 రోజులు, 4, 5, 9, 10, 14, 15 మంచి ముహూర్తాలు ఉన్నాయి.

ఇక ఖర్మ రోజులలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను ఖరారు చేయవద్దు. ఈ సమయం పెట్టుబడికి అనుకూలంగా ఉండదు. వివాహం, గృహప్రవేశం చేయరాదు. ఈ మాసంలో పూజలు, పఠనం, మంత్రోచ్ఛారణలు మొదలైనవి చాలా శుభప్రదమైనవిగా చెబుతారు. దీని ఫలితంగా వ్యక్తికి తరగని పుణ్యాలు లభిస్తాయి.

Tags:    

Similar News