Lighting Lamp Rules: దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.. పాటించకుంటే పూజా ఫలాన్ని పొందలేరు..!

Lighting Lamp Rules: హిందూ సంప్రదాయం ప్రకారం దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా ముందుగా దీపం వెలిగించి ప్రారంభిస్తారు.

Update: 2024-02-03 01:30 GMT

Lighting Lamp Rules: దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.. పాటించకుంటే పూజా ఫలాన్ని పొందలేరు..!

Lighting Lamp Rules: హిందూ సంప్రదాయం ప్రకారం దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా ముందుగా దీపం వెలిగించి ప్రారంభిస్తారు. ఏ పూజ చేసినా ముందుగా దీపం వెలిగించి మొదలుపెడుతారు. దీపం వెలిగించకుండా చేసే ఏ పూజ అయినా అసంపూర్ణమే అని చెబుతారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలి. లేదంటే పూజా ఫలాలను పొందలేరు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పూజ సమయంలో దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని అందరూ పాటిస్తారు. అయితే దీపం వెలిగించే పద్దతులను పాటించరు. దీని వల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను పొందలేరు. పూజ సమయంలో వెలిగించే దీపం శుభ్రంగా ఉండాలి. దీపం వెలిగించే చిప్ప గానీ గిన్నె కానీ పగిలి ఉండకూడు. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది. మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించేటప్పుడు తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. పూజ ముగిసేలోపు దీపం ఆరిపోకుండా ఉంటుంది. పూజ మధ్యలో దీపం ఆరిపోవడాన్ని చెడు శకునంగా భావిస్తారు.

పూజ చేసేటప్పుడు పూజ దీపం తప్ప మరే ఇతర దీపం ధూపం వెలిగించకూడదు. పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగిస్తే వెంటనే మరో నూనె దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి. నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమ వైపున ఉంచండి. నూనె దీపం వెలిగిస్తే దానిని కుడి వైపున ఉంచండి. నూనె దీపంలో ఎర్రటి వత్తిని ఉపయోగించడం శుభప్రదంగా చెబుతారు. ఇంటి దీపానికి దూదిని ఉపయోగించవచ్చు. పూజా స్థలంలో దీపాన్ని ఎప్పుడూ పడమర దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

Tags:    

Similar News