Lakshmi: ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలా.. అయితే, ఈ వస్తువులు ఇంటికి తెస్తే సరి.. ఆనందంతోపాటు సంపదకు ఢోకా ఉండదు..

Goddess Lakshmi: లక్ష్మీ దేవతను సంపదకు దేవతగా భావిస్తారు. ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే జీవితంలో ఆనందం నిండుతుందని ఒక నమ్మకం.

Update: 2023-07-28 01:30 GMT

Lakshmi: ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలా.. అయితే, ఈ వస్తువులు ఇంటికి తెస్తే సరి.. ఆనందంతోపాటు సంపదకు ఢోకా ఉండదు..

Goddess Lakshmi: లక్ష్మీ దేవతను సంపదకు దేవతగా భావిస్తారు. ఆమె అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే జీవితంలో ఆనందం నిండుతుందని ఒక నమ్మకం. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఆశీర్వాదాలు ఉంటాయి. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. విశ్వాసాల ప్రకారం, లక్ష్మీ దేవత కొన్ని వస్తువులను చాలా ఇష్టపడుతుందంట. వాటిని ఇంట్లోకి తీసుకురావడం ద్వారా లక్ష్మీ దేవత అనుగ్రహం మొదలవుతుందంట.

తులసి:

తులసి మొక్క చాలా పవిత్రమైనది. పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు. హిందూ మతంలో, ప్రజలు ఈ మొక్కను ఇంట్లో పెంచుతుంటారు. ఉదయం, సాయంత్రం పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని ఒక నమ్మకం. తులసి మొక్కకు ప్రతిరోజు నీటిని సమర్పించి పూజించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

శంఖం:

హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యంలోనూ, వాస్తులోనూ దీనికి ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శంఖం శబ్ధం ప్రతిధ్వనించే ఇంట్లో ప్రతికూల శక్తి ఎప్పుడూ ఉండదు. పూజ సమయంలో ప్రజలు శంఖం ఊదడానికి కారణం ఇదే. శంఖం నుంచి లక్ష్మీదేవి అవతరించిందనేది ఒక నమ్మకం. అమ్మవారికి శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో శంఖం ఉంచేవారిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

తామరపువ్వు:

తామరపువ్వులో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే తల్లికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి పూజలో కూడా తామర పువ్వులు సమర్పిస్తారు. ఇటువంటి పరిస్థితిలో, మీరు లక్ష్మీ దేవిని పూజించినప్పుడల్లా, మీరు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించాలి.

కొబ్బరి:

కొబ్బరికాయను హిందూ మతంలో అన్ని రకాల మతపరమైన, పవిత్రమైన పనులలో ఉపయోగిస్తారు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు. కొబ్బరికాయ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అందులో అమ్మవారు నివసిస్తుందని నమ్ముతారు.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, మత విశ్వాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్‌ఎంటీవీ వీటిని ధృవీకరించలేదు.)

Tags:    

Similar News