శ్రీనివాసుడికి పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు?

Update: 2019-08-07 11:51 GMT

ఇంతకూ శ్రీవారి మూలవిరాట్టుకు గడ్డంపై పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? శ్రీవారిని అనంతాళ్లారు కొట్టడం వల్లనే గాయమైందని, ఆ గాయాన్ని మాన్పడానికి, అది కనిపించకుండా ఉండటానికి పచ్చ కర్పూరం వినియోగిస్తారన్నది భక్తజనులందరికీ తెలిసిన గాథ. దీనికి గురుతుగా శ్రీవారి ఆలయంలో ఒక మూలన అనంతాళ్వారు శ్రీవారిని కొట్టినట్టుగా చెప్పబడుతున్న గుణపం కూడా ఉందని వారు చెబుతుంటారు. మరి ఇదంతా నిజమేనా అంటే కాదంటున్నారు అర్చకస్వాములు. స్వామివారి ముఖారవిందంలో ఎక్కడా గాయం లేదని వారు కొట్టిపారేస్తున్నారు. పచ్చకర్పూరం పెట్టడం శాస్ర్త సంబంధమైన విషయమే కానీ, గాయం కాదని వారంటారు. పురాణాల్లోనే ఇవన్నీ వున్నా.... స్వామివారి స్వరూపంలో లేవని చెబుతారు... స్వామి వారిని నేరుగా తాకి సేవలందించే రమణదీక్షితులు.

ఏడుకొండలపై ఎన్నో అనుమానాలు. మరెన్నో సందేహాలు. సప్తగిరుల్లో కొలువైన భక్త జన సులభుడి దివ్య మంగళ రూప రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న తపన. యుగయుగాల నుంచి వన్నె తరగని వేంకటేశుని విగ్రహంలో ఉన్నదేమిటి? స్వయంభువుగా వెలిసిన సప్తగిరీశుడిపై పౌరాణిక గాథలో ఉన్నదేమటి? తిరుమల అంటేనే పులకించిపోయే భక్తులు ఏమనుకుంటున్నారు.? దివ్యమైన అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించే ఏడుకొండలవాడి జుట్టుపై ఉన్న అనుమానాలు ఏమిటి? కాలానికి అతీతుడైన ఏడుకొండలవాడి విగ్రహ రూపం ఎన్నో నిజాలు చెబుతున్నాయ్‌.

Tags:    

Similar News