Before Diwali: దీపావళి లోపు ఈ వస్తువులను తీసేయండి.. లేదంటే లక్ష్మీమాతకి కోపం వస్తుంది..!

Before Diwali: ఈ ఏడాది దీపావళి పండుగ 12 నవంబర్ 2023న ఆదివారం వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

Update: 2023-10-14 01:30 GMT

Before Diwali: దీపావళి లోపు ఈ వస్తువులను తీసేయండి.. లేదంటే లక్ష్మీమాతకి కోపం వస్తుంది..!

Before Diwali: ఈ ఏడాది దీపావళి పండుగ 12 నవంబర్ 2023న ఆదివారం వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు తన భక్తులకు విశేషమైన ఆశీర్వాదాలు అనుగ్రహాలను అందిస్తుంది. దీపావళి పండుగ ప్రతిసారీ అమావాస్య రోజు జరుపుకుంటారు. రాత్రి పూర్తిగా చీకటిగా ఉంటుంది దీపాలను వెలిగించడం వల్ల చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. భక్తులలో ఉన్న అంధకారం తొలగిపోతుంది. వారిలో జ్ఞాన కాంతి ప్రజ్వరిల్లుతుంది.

వాస్తు ప్రకారం దీపావళి రోజున కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అందుకే కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలని పాటిస్తే లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం, ప్రయోజనం పొందుతారు. వాస్తు ప్రకారం దీపావళికి ముందు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తీసివేయాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటే దీపావళికి ముందే తొలగించాలి. ఇది ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. దీనివల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. అందుకే పగిలిన అద్దాలను తీసేయడం ఉత్తమం. అలాగే ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే వెంటనే తీసేయండి. లేదా మరమ్మత్తు చేయండి. లేదంటే కుటుంబ సభ్యులపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.

దీపావళి రాకముందే ఇంట్లో ఉండే విరిగిన వస్తువులను తొలగించాలి. ఎందుకంటే ఇవి ఇంట్లో వాస్తు దోషాలను సృష్టిస్తాయి. ఇంటి పురోగతిని అడ్డుకుంటాయి. అదే సమయంలో ఇంట్లో విరిగిన మంచం ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. అలాగే దీపావళి రోజు పాత దీపాలను ఉపయోగించకూడదు. కొత్త దీపాలను కొనుగోలు చేయాలి.

Tags:    

Similar News