Budhaditya Rajyog 2024: మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి.. ఈ గ్రహాల వారికి అదృష్టం..!

Budhaditya Rajyog 2024: జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది.

Update: 2024-03-12 01:30 GMT

Budhaditya Rajyog 2024: మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి.. ఈ గ్రహాల వారికి అదృష్టం..!

Budhaditya Rajyog 2024: జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఇందులో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి నెగిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ప్రతి గ్రహం దాని నిర్దిష్ట కాలం తర్వాత మారుతూ ఉంటుంది. తాజాగా మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధ గ్రహం ఇప్పటికే ఆ రాశిలో కొనసాగుతోంది. సూర్యుడు బుధ గ్రహం కలయిక ఏర్పడుతుంది. ఇది బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల 4 రాశుల వారి జీవితాలలో సంపద, ఐశ్వర్యం, సంతోషం, శాంతి నెలకొంటుంది. ఆ రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కర్కటక రాశి

మీనరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్‌తో పాటు ఆర్థిక లాభం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కన్యారాశి

మీనరాశిలో బుధుడు, సూర్యుడి కలయిక వల్ల కన్యా రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు జరుగుతాయి. పెట్టుబడికి అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొత్త లాభాలు వస్తాయి. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

మకరరాశి

మకర రాశి వారికి మార్చి 15 తర్వాత లాభం చేకూరుతుంది. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల మనస్సు ఆకర్షితులవుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి సమయం.

మీన రాశి

మీనరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Tags:    

Similar News