Mithila Janaki Mata Temple : మన భారత దేశంలో హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో సీతారాములు కూడా ఉన్నారు. సీతా రాముల గురించి, మహాలక్ష్మీ స్వరూపమైన జానకీ మాత గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఎక్కడ చూసినా సీతారుముడు ఇద్దురు కొలువు దీరిన ఆలయాలే ఉంటాయి. కానీ జానకీ మాతా ఒక్కరే భక్తులకు దర్శనం ఇచ్చే ఆయలం ఒకటి ఉందని చాలా మందికి తెలిసి ఉండదు. కానీ ఆ ఆయలం కూడా ఒకటి ఉంది. ఏంటి అనుకుంటున్నారా. కానీ అది నిజం ప్రస్తుతం నేపాల్ లోని జనక్ పూర్ గా పిలుచుకునే ప్రాంతమే అప్పటి మిథిల. అక్కడే ఈ ఆలయం ఉంది. పూర్వం విదేహరాజ్యాన్ని జనకమహారాజు పాలిస్తున్నాడు. వెదేహరాజ్యానికి జనకుడు 21వ సంతతి వాడు. మిధిలా రాజకుమారి సీతాదేవి జకమహారాజుకు భూమిని దున్నుతున్న సమయంలో మట్టిపాత్రలో లభించిన ప్రదేశాన్ని సీతామర్షి అంటారు. మిథిల రామాయణంలో జనకుడు, మిథి పరిపాలించిన విదేహ రాజ్యానికి చెందిన ప్రాచీన రాజధాని నగరము. ఆధునిక కాలంలో దాన్నే నేపాల్ లోని జనక్ పూర్ గా పిలుస్తారు. జానకి మందిరం నేపాల్ లోని మిథిలా ప్రాంతంలో జానక్‌పూర్ లోని ఒక హిందూ ఆలయం. ఇది హిందూ దేవత సీత కు అంకితం చేయబడింది.
ఇది హిందూ-కొయిరి నేపాలీ నిర్మాణకళకు ఒక ఉదాహరణ. నేపాల్ లోని కోయిరి శిల్పకళకు ఇది చాలా ముఖ్యమైన నమూనాగా పరిగణించబడుతుంది. పూర్తిగా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్, కొయిరి గోపురాల మిశ్రమ శైలిలో 4,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినది. ఈ నిర్మించిన ఆలయం ఎత్తు 50 మీటర్లు ఉంటుంది. ఈ మందిరం పూర్తిగా రాతితో, పాలరాయితో చేసిన మూడు అంతస్థుల నిర్మాణం. దీని 60 గదులు నేపాల్ యొక్క జెండాతో రంగు గ్లాసులతో, చెక్కడాలు, చిత్రలేఖనాలు, అందమైన జాలక కిటికీలు, టర్రెట్లతో అలంకరించబడ్డాయి. ఇతిహాసాలు, పురాణాలు ప్రకారం, రామాయణం కాలంలో జనక మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. తన కుమార్తె జానకి (సీత), తన స్వయంవరంలో, తన భర్తగా దైవాంశ సంభూతుడయిన శ్రీరాముడు ను ఎన్నుకుంది, అయోధ్య కు రాణి అయింది. వారి వివాహ వేడుక సమీప ఆలయంలో జరిగింది. దీనినే వివాహా మండపం అంటారు. 2008 లో తాత్కాలికంగా ఈ ప్రదేశం యునెస్కో గుర్తింపు పొందింది.