Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఈ దిశలో పెట్టారా.. ప్రమాదంలో పడినట్లే.. బెడ్‌రూంలో అలా అస్సలు ఉండకూడదంట..!
Vastu Tips For Mirror: అద్దాలను అమర్చేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతుంటాయి. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అద్దం పెట్టుకుంటే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండొచ్చు.
Vastu Tips For Mirror: స్త్రీ అయినా, పురుషుడైనా ప్రతి ఒక్కరికి తమ అందంగా ఉండాలని కోరుకుంటుంటారు. మనం అందంగా తయారు కావాలంటే మన ముందు అద్దం ఉండాల్సిందే. ఈ రోజుల్లో అద్దాలు లేని ఇంటిని అస్సలు ఊహించుకోలేం. అయితే మీ ఆనందం, అదృష్టం కూడా అద్దానికి సంబంధించినవని మీకు తెలుసా? అద్దాలను అమర్చేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతుంటాయి. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అద్దం పెట్టుకుంటే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండొచ్చు. గాజు సంబంధిత వాస్తు చిట్కాలు, దోషాల గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో అద్దం ఇన్స్టాల్ చేసేటప్పుడు, మొదట దిశను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర గోడపై ఎప్పుడూ అద్దం పెట్టాలని గుర్తుంచుకోండి. చూసేవారు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా అద్దం పెట్టాలి.
ఇంట్లో పడకగదిలో అద్దం ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అద్దంలో పరుపు ప్రతిబింబం వాస్తు దోషాలను సృష్టిస్తుంది. దీంతో ఇళ్లలో నివాసముంటున్న జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.
ఇంట్లో అమర్చిన అద్దం ఎప్పుడూ మురికిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం, మురికి అద్దం అనర్థాలను కలిగిస్తుంది. కాబట్టి రోజూ శుభ్రం చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత అద్దంలో చూసుకోవడం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి.
పగిలిపోయిన అద్ధంలో మనల్ని మనం చూసుకోకూడదని గుర్తుంచుకోంది. ఇది సమస్యలను సృష్టిస్తుంది.
వంటగది ముందు అద్దం పెట్టడం మానుకోవాలి. గ్యాస్ స్టవ్ జ్వాల ద్వారా గాజుపై చేసిన ప్రతిబింబం చాలా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెటీరియల్ ప్రకారం ఇది సరైనది కాదు.
ఇంటిలోపల అష్టభుజి అద్దం అమర్చడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి అద్దం శుభప్రదం.
వాస్తు ప్రకారం, ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో అద్దం పెట్టడం శ్రేయస్కరం కాదు. దీంతో ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అద్దాలను ఉంచడానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను ఎంచుకోవాలి.
పగిలిన గాజును ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. వెంటనే దాన్ని బయటపడేయండి. లేకపోతే అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. మసక అద్దంలో మీ ముఖాన్ని ఎప్పుడూ చూడకండి.
(గమనిక: ఇక్కడ అందిచిన సమాచారం సాధారణ నమ్మకాలు, సోషల్ మీడియాలో లభించిన విషయాలను జోడించి అందించాం. HMTV వీటిని ధృవీకరించడంలేదు. ఏదైనా విషయాలను ఫాలో చేయాలంటే మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)