Astrology: వృషభరాశిలో బుధుడి ఎంట్రీ.. ఈ 5 రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు.. అందులో మీరున్నారా..!
Mercury Transit 2023: బుధుడిని తర్కం, బుద్దిని ప్రసాదించే గ్రహంగా భావిస్తారు. గ్రహాల రాజకుమారుడు బుధుడి రాశి ప్రవేశం ఈ 5 రాశుల జీవితాల్లో కల్లోలం కలిగించనుంది.బుధుడు జూన్ 7న వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో అనుకూల, ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 5 రాశులపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. మరి ఆ రాశులలేంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Mercury Transit 2023: ప్రస్తుతం జాతకాలు, గ్రహాల ప్రభావం, జ్యోతిష్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతినెల ఇలా తమ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుందో చెక్ చేసుకుంటుంటారు.
అయితే, కొంతమంది మాత్రం ఈ జ్యోతిష్యాన్ని అంతగా నమ్మరు. కొంతమంది కలసి వస్తే, మరికొంతమందికి ఈ ప్రభావంతో అస్సలు లక్ కలసిరాదు.
బుధ గ్రహాన్ని బుద్దిని ప్రసాదించేది చెబుతుంటారు. గ్రహాల రాజకుమారుడిలా పేరుగాంచిన బుధుడి ఆగమనంతోముఖ్యంగా 5 రాశుల జీవితాల్కీలక మార్పులు కలగనున్నాయి. జూన్ 7 నుంచి బుధుడు వృషభరాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
వృషభరాశిలోకి బుధ గ్రహ ప్రభావంతో 5 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఇందులో మీరున్నారో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి.
మేషరాశి: ఈ ప్రభావంతో ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్స్ మేషరాశి వారికే ఉంది. దీంతో వీరి జీవితాల్లో కీలక మార్పులు కలగనున్నాయి. ఈ పరిస్థితితో లైఫ్ ఫార్టనర్‌తో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితితోపాటు మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
సింహరాశి: ఈ ప్రభావంతో సింహరాశి వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. వ్యాపారంలో అధిక పోటీతోపాటు ఆర్ధికంగా చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంతోపాటు, వ్యాపారంలోనూ ఒత్తిడితో చిత్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా దారుణంగా దెబ్బతింటుంది. దీంతో చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: వృషభరాశిలోకి బుధ గ్రహ ప్రభావంతో వృశ్చిక రాశి వారికి ఏ మాత్రం అనుకూలమైనది కాదు. పని ఒత్తిడి తీవ్రంగా పెరడగం వల్ల ఆందోళనలతో సతమతమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టుబడి పెట్టే విషయంలో కాస్త వేచి ఉండాల్సిందే. లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. లైఫ్ ఫార్టనరతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం విశ్వాసాలు, సోషల్ మీడియాలో లభించిన సమాచారంతో అందించాం.హెచ్‌ఎంటీవీ దీనిని ధృవీకరించలేదు. వాటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే, ఇది కచ్చితమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.)