Maha Shivaratri: శివ పూజ నియమాలివే..!

Maha Shivaratri: హిందువుల పండుగలలో మహా శివరాత్రి ప్రత్యేకమైంది. ఈ రోజు శివుడు, పార్వతి వివాహం జరిగిన రోజని చెబుతుంటారు.

Update: 2021-03-10 11:33 GMT
శ్రీశైలం దేవాలయం (ఫొటో శ్రీశైలం టెంపుల్ వెబ్ సైట్)

Maha Shivaratri: భగవంతునితో భక్తుడు అనుసంధానం కావడానికి కావలసిన మార్గాలను సూచించే పండుగ శివరాత్రి. ఉపవాసం.. జాగరణ.. రెండు విధానాలతో పరమ శివుడి చెంత మన ఆత్మను అంకితం చెయయడమే శివరాత్రి. రేపు (11.03.2021) మహాశివరాత్రి పర్వదినం ఈ సందర్భంగా శివరాత్రి విశేషన్షాలు మీకోసం.

హిందువుల పండుగలలో మహా శివరాత్రి (Maha Shivaratri) కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు శివుడు, పార్వతి వివాహం జరిగిన రోజని, అలాగే శివుడు (Lord Shiva) ఈ రోజే లింగాకారంగా మారడని చెబుతుంటారు. సంవత్సరంలోని 12 శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైంది. మార్చి 11న గురువారం నాడు దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని నిర్వహించేదుకు ప్రముఖ ఆలయాలు సిద్ధమయ్యాయి.

శివుడికి అభిషేకాలంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. అందుకే అభిషేక ప్రియుడని అంటారు. మహా శివరాత్రి రోజున భక్తి శ్రద్దలతో పరమేశ్వరున్ని పూజిస్తే..జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తారు. ఇక ప్రధానంగా శివుడికి బిల్వ ఆకులతో అభిషేకం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతుంటాయి. ఈ రోజు భక్తులు ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తూ..శివ నామస్మరణతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

అయితే శివరాత్రి పూజల్లో తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు మనకు దోషాలను కలిగిస్తాయని, చేసే పూజలో ఎటువంటి దోషాలు లేకుండా శివరాత్రి పూజను ముగించాలని పెద్దలు అంటుంటారు. మరి, పూజా సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.. పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం..

మహాశివరాత్రి రోజూ పూజా విధానంలో పాటించవలసిన నియమాలు..

  • పంచామృతాల (ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి) తో శివుడికి అభిషేకం చేయాలి.
  • ఈ అభిషేకం పూర్తయ్యేంత వరకు 'ఓం నమః శివాయ' పంచాక్షరీ మంత్రం జపిస్తూ ఉండాలి.
  • ముందుగా చందన లేపనంతో పూజను మొదలుపెట్టి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేసి పుర్ణాహుతి నిర్వహించాలి.
  • శివుడి కథలు, పాటలు వింటూ రాత్రంగా జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్సించాలి.
  • తెల్లవారుజాబున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి.
  • సంవత్సరంలో ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్ధశి శివుడికి ఇష్టమైన రోజు. కాబట్టి ఆ రోజును మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ బహుళ చతుర్ధశి రోజును మహాశివరాత్రి అని అంటారు.
  • ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివుడికి బిల్వ ఆకులంటే చాలా ప్రీతి. వీటిని పూజలో తప్పక ఉపయోగించాలి.
  • మహా శివరాత్రి రోజున సూర్యోదయానికి మందే నిద్రలేచి తల స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకుని, పూజను ప్రారభించాలి.
  • ఉపవాస, జాగరణలో శివ నామస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు శివభక్తులకు అన్నదానం చేయాలి.
  • సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. అలాగే రాత్రి ఉపవాసం, జాగరణ తర్వాత సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి, ప్రసాదాలను స్వీకరించి అనంతరం ఉపవాసం దీక్షను విరమించాలి. అలాగే రాత్రి వరకు నిద్ర పోకూండ ఉంటేనే ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.
Tags:    

Similar News