పవిత్ర కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? కార్తీకంలో ముఖ్యమైన రోజులు ఏవి?

కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన రోజులివే!

Update: 2020-11-14 06:07 GMT

దీపావళి సంబరమే వేరు. దాదాపుగా నెలరోజుల ముందునుంచీ హడావుడి. టపాసుల తయారీ కోసం.. వాటిని కాల్చడం కోసం ఎదురుచూపులు. బోలెడన్ని ప్లానులు.. కాకరపూవొత్తుల వెలుగులు.. సిసింద్రీల చిట చిటలు.. మతాబుల ముచ్చట్లు.. చిచ్చుబుడ్డి కవ్వింతలు.. సందడిని అంబరానికి చేర్చే తారాజువ్వల కేరింతలు.. భయపెట్టే లక్ష్మీ బాంబులు.. బెదిరించే పెటేపికాయలు(తాటాకు బాంబులు)..ఫట్ ఫట్ లాడించే సీమ టపాకాయలు.. వీటన్నిటి హడావుడిని నిశ్శబ్దంగా చూస్తూ తమలో తాము నవ్వుకునే దీపాల వరుసలు.. ఇలా జీవితాన్ని మొత్తం మనకి చూపించే వెలుగుల పండుగ దీపావళి!

దీపావళి పండుగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళాన్ని తనతో తీసుకు వస్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనదని పండితులు చెబుతారు. ఇటు శివ భక్తులు.. అటు వైష్ణవ ప్రియులు కూడా కార్తీక మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివాలయాల్లో దీపతోరణాలు.. ఆకాశాదీపాలు.ప్రత్యేక అభిషేకాలు..పూజలు కనుల పండువగా నిర్వహిస్తారు. ఇక భక్త జనకోటి తెల్లవారుజామున చన్నీటి స్నానాలు.. ఉపవాస దీక్షలు.. మహిళా భక్తులు కేదారేశ్వర నోములు చేస్తూ కార్తీక మాసం అంతా చాలా పవిత్రమైన భావనలో దేవుని సేవలో నిమగ్నమైపోతారు.

స్వామి అయ్యప్ప సేవ కోసం మలధారణలు కార్తీక మాసంలో చేస్తారు. శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించుకోవడానికి వేసే 41 రోజుల మాల కోసం సరైన సమయం కార్తీక మాసమే అని అయ్యప్ప భక్తుల నమ్మకం. ఒక పక్క చలి పెరుగుతున్నా.. వేకువ జామున స్నానాదులు ముగించి అయ్యప్ప భజనలు చస్తూ పూజలు నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నదే.

ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కార్తీక మాసంలో సోమవారం మరింత ప్రత్యేకమైనదిగా భక్తులు భావిస్తారు. కార్తీక సోమవారం ఉపవాస దీక్షలు చేస్తారు. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే పండుగలు.. పర్వ దినాలు.. ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూద్దాం..

నవంబర్ 16 న కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. సరిగ్గా ఆరోజు సోమవారం కూడా కావడం విశేషం. దీంతో ఈ కార్తీకంలో ఐదు సోమవారాలు వస్తాయి.

అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజులు ఇలా ఉన్నాయి..

*నవంబర్ 16కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం,

*నవంబర్ 18బుధవారం నాగులచవితి,

*నవంబర్ 20శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం,

*నవంబర్ 21శనివారం శ్రవణా నక్షత్ర కోటి దీపాల పూజ,

*నవంబర్ 23రెండవ సోమవారం,

*నవంబర్ 25బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి,

*నవంబర్ 26గురువారం చిల్కు ద్వాదశి,

*నవంబర్ 28శనివారం శనిత్రయోదశి,

*నవంబర్ 29ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం,

*నవంబర్ 30మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి,

*డిసెంబర్ 4 శుక్రవారం సంకష్టహర చతుర్థి,

*డిసెంబర్ 7నాలుగవ సోమవారం,

*డిసెంబర్ 10గురువారం ఉపవాస ఏకాదశి,

*డిసెంబర్ 11శుక్రవారం గోవత్స ద్వాదశి,

*డిసెంబర్ 12శనివారం -శనిత్రయోదశి,

*డిసెంబర్ 13ఆదివారం మాసశివరాత్రి,

*డిసెంబర్ 14ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం,

*డిసెంబర్ 15పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి.

Tags:    

Similar News