Vastu Tips: వాస్తు ప్రకారం చిలుకలు పెంచితే చాలా మంచిది.. ఇంట్లో ఈ ఫలితాలను పొందుతారు..!
Vastu Tips: చిలుకలు చాలా అందమైన పక్షులు. ఇవి తిరిగి మాట్లాడే శక్తిని కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిలుకలు పెంచితే పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది.
Vastu Tips: చిలుకలు చాలా అందమైన పక్షులు. ఇవి తిరిగి మాట్లాడే శక్తిని కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిలుకలు పెంచితే పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది. చిలుకల విగ్రహాలు లేదా చిత్రాలు ఇంట్లో ఉంటే అదృష్టం. హిందూ మత గ్రంథాల ప్రకారం చిలుక కుబేరుడు, తల్లి లక్ష్మిమాతకి చిహ్నంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఈ ఆకుపచ్చ పక్షి మెర్క్యురీకి చిహ్నంగా చెబుతారు. చిలుక ఇంటి పరిసరాల్లో ఉండటం వల్ల సంపద పెరుగుతుంది. చిలుకల రంగురంగుల ఈకలు, వాటి మధురమైన స్వరం ఇంట్లోకి పాజిటివ్ శక్తిని ఆహ్వానిస్తాయి.
జతగా చిలుకలు
చిలుక శాంతి, ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో చిలుక ఉండటం వల్ల సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. చిలుకను కామదేవుని వాహనంగా చెబుతారు. ఇది ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలను కాపాడుతుంది. అయితే చిలుకను పెంచేటప్పుడు జతగా పెంచాలని గుర్తుంచుకోండి. దీనివల్ల భార్యాభర్తల మధ్య బంధం మధురంగా ఉంటుంది.
ఇంట్లో చిలుకలు తూర్పు, ఉత్తర దిశలలో ఉంచాలి
చిలుకలు పెంచేటప్పుడు వాటిని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. దీనివల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
అకాల మరణం నుంచి రక్షణ
నమ్మకమైన పక్షిగా పరిగణించబడే చిలుక అకాల మరణం నుండి రక్షణ కల్పిస్తుంది. చిలుక కష్టాలను తనంతట తానుగా తీసుకుని ఇంట్లోని ప్రజలను అకాల మరణం నుండి కాపాడుతుంది.
చిలుక మాట్లాడటం
చిలుకలు ఇంట్లో పాజిటివ్ శక్తిని ప్రసరించేలా చేస్తాయి. పిల్లలకు చదువుపై ఆసక్తి లేకుంటే చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వీటికోసం పెరట్లో పచ్చని కూరగాయలు, పండ్ల చెట్లు నాటాలి. అప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్లవు.