Puja Rules: పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే అశుభం.. కొన్ని సంఘటనలు శుభం..!
Puja Rules: దేవుడి పూజలు జరుగుతున్నప్పుడు తరచుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి కొన్ని సంకేతాలను బట్టి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ముందుగానే ఊహించవచ్చు.
Puja Rules: దేవుడి పూజలు జరుగుతున్నప్పుడు తరచుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి కొన్ని సంకేతాలను బట్టి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ముందుగానే ఊహించవచ్చు. శకున శాస్త్రం ప్రకారం పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. వాస్తవానికి భగవంతుడు సంతోషించినా, కోపించినా కొన్ని సంకేతాలని సూచిస్తాడు. వాటి ద్వారా శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా చెప్పవచ్చు. అలాంటి కొన్ని సంకేతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పూజ సమయంలో చేతులు కాలడం
శకున శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు పూజ సమయంలో దీపం వెలిగించేటప్పుడు చేయి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. ఆ వ్యక్తి పూజ సమయంలో ఏదో తప్పు చేశాడని అర్థం. అందుకే నిండు హృదయంతో, భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించాలి.
పూజ సమయంలో కన్నీళ్లు
శకున శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పూజ చేసేటప్పుడు కన్నీరు కార్చినట్లయితే అతడు పూజ ఫలితాలను పొందబోతున్నాడని అర్థం. అతని కష్టాలు తొలగిపోతున్నాయని తెలుస్తుంది. మీరు చేయబోయే పనిలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు.
దీపం ప్రభావవంతంగా వెలగడం
శకున శాస్త్రం ప్రకారం దీపం వెలిగించిన తర్వాత దాని జ్వాల మరింత వేగంగా పెరిగితే దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం.
పూజ సమయంలో ఆవలింతలు
శకున శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పూజ సమయంలో పదేపదే ఆవలిస్తే అది అశుభంగా చెబుతారు. అంటే వ్యక్తిలో ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తి తన ఆలోచనల స్వచ్ఛతపై శ్రద్ధ వహించాలి.