Navratri 2023: దుర్గామాత అనుగ్రహం కోసం నవరాత్రులలో ఈ వస్తువులు కొనడం శ్రేయస్కరం..!
Navratri 2023: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉంది.
Navratri 2023: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉంది. అక్టోబర్ 15 నుంచి ప్రారంభించి 24 వరకు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఈ 9 రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది. ఉపవాసం పాటించడంతో పాటు కచ్చితంగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నవరాత్రులలో ఎలాంటి వస్తువులు కొనాలో ఈ రోజు తెలుసుకుందాం.
నవరాత్రులలో దుర్గామాత పాదముద్రలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజూ పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. సనాతన ధర్మంలో కలశాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కలశ స్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితిలో నవరాత్రుల సమయంలో ఇంటికి తప్పనిసరిగా మట్టి, వెండి, బంగారం లేదా ఇత్తడి కలశం తీసుకురావాలి. దుర్గా బిసా యంత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం జరగదని గ్రంథాలలో చెప్పారు. దీనివల్ల సంపద అద్భుతంగా పెరుగుతుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది.
నవరాత్రుల మొదటి రోజున ఎర్రటి త్రిభుజాకార జెండాను కొని అమ్మవారి మండపం పైన లేదా ఇంటి పూజగదిలో ఉంచి ప్రతిరోజు పూజించి, నవమి రోజున ఈ జెండాను గుడి గోపురంలో పెట్టాలి. ఇది కుటుంబంలో ఆనందం, సంతోషం అందిస్తుంది. 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం దుర్గామాతను పూజించాలి. సాయంత్రం హారతి ఇవ్వాలి. అలాగే అమ్మకు నచ్చిన పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. నవరాత్రులలో దుర్గామాతకు ఎర్రని వస్త్రాలను సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు.