Vastu Tips: ఇంట్లో సంపద, శాంతి కరువైందా.. ఈ 3 విగ్రహాలు తీసుకొస్తే చాలు.. అదృష్టంతోపాటు కనకవర్షమే..!

Vastu Tips for Money: సంపద, సంతోషం కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక రకాల విగ్రహాలు ప్రస్తావించారు.

Update: 2023-05-17 00:30 GMT

Vastu Tips: ఇంట్లో సంపద, శాంతి కరువైందా.. ఈ 3 విగ్రహాలు తీసుకొస్తే చాలు.. అదృష్టంతోపాటు కనకవర్షమే..!

Vastu Tips for Money: చెడు చూపులు, చెడు దృష్టి నుంచి ఇంటిని రక్షించడానికి, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, నేడు చాలామంది తమ ఇండ్లను వాస్తు శాస్త్ర నియమాలతో కడుతుంటారు. అలాగే వాస్తు ప్రకారం మార్పులు చేస్తుంటారు. ఇంట్లో గదులు, వస్తువులకు సంబంధించి సరైన దిశలో శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్రం సలహా ఇస్తుంది. దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. వాస్తును పాటించడం వల్ల డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కలుగుతాయని భావిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇంటి లోపల కొన్ని వస్తువులను ఎల్లప్పుడూ ఉంచాలని చెబుతుంటారు. సంపద, సంతోషం కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక రకాల విగ్రహాలు ప్రస్తావించారు. వాటిని ఇంటికి తీసుకువచ్చిన వారికి అదృష్టం అనుకూలంగా ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

శాంతి కోసం ఏనుగు..

వాస్తు శాస్త్రంలో ఏనుగును ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంట్లో డబ్బుకు సంబంధించి నిత్యం గొడవలు జరిగి ఇంటి శాంతికి భంగం కలిగితే ఇంట్లో వెండి లేదా ఇత్తడి విగ్రహాన్ని తీసుకురావాలి. దీంతో పాటు ఇంట్లో రాహు దోషం కూడా తొలగిపోతుంది.

శ్రేయస్సు కోసం తాబేలు..

తాబేలును ఇంట్లోకి తెచ్చిన తరువాత, అది విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. కాబట్టి దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. మీరు ఇంటికి తెచ్చిన తాబేలు బొమ్మలో ఏదైనా లోహం ఉండాలి అని గుర్తుంచుకోండి. ఫలితంగా ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

పురోగతి కోసం చేప..

ఇత్తడి చేపలు లేదా వెండి చేపలు గృహంలో పురోభివృద్ధిని తెస్తాయి. కాబట్టి వాటిని ఇంట్లో ఉంచడం మంచిది. మీరు చేపలను లోపలికి తీసుకువచ్చేటప్పుడు, దానిని ఇంటికి ఈశాన్యం వైపు ఉంచాలని గుర్తుంచుకోండి. దీంతో కుటుంబానికి ఆదాయ వనరులు ఏర్పడతాయని చెబుతుంటారు. సంతృప్తిలోనూ గణనీయమైన పెరుగుదల ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం నమ్మకాలు, సోషల్ మీడియాలో లభించిన విషయాలను ఆధారంగా చేసుకుని అందించాం. వీటితో కచ్చితమైన ప్రయోజనాలు ఉన్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. వీటిని పాటించే ముందు నిపుణుల సలాహా తీసుకోవచ్చు.

Tags:    

Similar News