Diwali 2023: పూజ గదిలో బంగారు వస్తువులు ఉంచడం శుభమా.. అశుభమా..!

Diwali 2023: దీపావళి పండుగ వచ్చేసింది. వాస్తు ప్రకారం ఇంట్లోని పూజగదిలో కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే చాలా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

Update: 2023-11-11 14:30 GMT

Diwali 2023: పూజ గదిలో బంగారు వస్తువులు ఉంచడం శుభమా.. అశుభమా..!

Diwali 2023: దీపావళి పండుగ వచ్చేసింది. వాస్తు ప్రకారం ఇంట్లోని పూజగదిలో కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే చాలా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ముందుగా పూజగదిని శుభ్రం చేయాలి. పెయింట్ వేయించాలి. మంచి కండీషన్‌లో ఉందా లేదా చూసుకోవాలి. అన్ని మత గ్రంథాలు పేర్కొన్న విధంగా పూజగదిని డెకరేషన్‌ చేయాలి. . ఇందులో దేవుడి విగ్రహాలకు సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దేవతల బంగారు, వెండి విగ్రహాలు

బంగారం, వెండిని స్వచ్ఛమైన లోహాలుగా పరిగణిస్తారు. ఇవి చాలా విలువైనవి. వాస్తు శాస్త్రంలో బంగారం, వెండికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. దీపావళి రోజు బంగారం, వెండి ప్రస్తావన రావడం సహజం. దీపావళి పండుగ సంపద, ఆనందాన్ని తెస్తుంది. ఈ రోజున బంగారం, వెండిని కొనుగోలు చేయడం శుభప్రదం. బంగారు-వెండి లక్ష్మీ గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేసినా లేదా పూజ కోసం బంగారు-వెండి పాత్రలను కొనుగోలు చేసినా అది చాలా శుభ ఫలితాలను అందిస్తుంది.

ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి సందర్భంగా పూజగదిలో బంగారం, వెండితో చేసిన లక్ష్మీ గణేశ్ విగ్రహాలను ఉంచడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. అలాగే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. విగ్రహాలను కొనుగోలు చేయకూడదనుకుంటే బంగారం, వెండి పాత్రలు లేదా ఆభరణాలను కూడా కొనుగోలు చేసి పూజలో ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సిద్దిస్తుంది.

ఈ ఆప్షన్‌ కూడా మంచిదే

బంగారం, వెండి చాలా ఖరీదు కాబట్టి దేవతా మూర్తులను కొనుగోలు చేయడం వీలుకాకపోతే రాగి, ఇత్తడి విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీటిని కూడా పూజ గదిలో పెట్టి ఆరాధించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి.

Tags:    

Similar News