Makar Sankranti 2024: సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది.. అవేంటంటే..?
Makar Sankranti 2024: హిందువుల పండుగలలో సంక్రాంతి ప్రత్యేక స్ధానం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఉత్తరం వైపు కదులుతాడు.
Makar Sankranti 2024: హిందువుల పండుగలలో సంక్రాంతి ప్రత్యేక స్ధానం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఉత్తరం వైపు కదులుతాడు. మకర సంక్రాంతి నుంచి దేవతల ఆరాధన ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి అన్ని మతపరమైన, శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున గంగాస్నానం చేసి దానధర్మాలు చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. సంక్రాంతి రోజున కొన్ని పనులు ఆచరిస్తే అదృష్టం వరిస్తుందని కొందరి నమ్మకం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. హిందూ విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్య ఫలితాలను పొందుతాడని చెప్పారు. ఈ రోజున సూర్యుడికి నీరు సమర్పించేటప్పుడు అందులో ఎర్రచందనం, పూలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి అర్ఘ్యం పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కెరీర్ ఆకాశాన్ని తాకడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది.
సంక్రాంతి రోజు వివాహిత స్త్రీలు ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకోవాలి. 14 రకాల వివాహ వస్తువులను పంచాలి. ఇలా చేయడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుంది. ఒక వ్యక్తి సంక్రాంతి రోజున నువ్వులు, దుప్పటి, ఎర్రటి బట్టలు, ఎరుపు మిఠాయిలు, వేరుశెనగలు, మూంగ్ దాల్ ఖిచ్డి, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని, రాహువు, కేతువు, సూర్యుని నుంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే వ్యక్తి ధనవంతుడు అవుతాడు.
మకర సంక్రాంతి రోజున ఆవుకు పచ్చి మేత, చీమలకు పంచదార కలిపిన పిండి, చేపలకు పిండి మాత్రలు, పక్షులకు మినుములు తినిపించడం శుభకరం. ఇలా చేయడం వల్ల డబ్బు ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సంక్రాంతి రోజున ఒక పిడికెడు నల్ల నువ్వులను తీసుకుని ఇంట్లోని సభ్యులందరి తలలపై 7 సార్లు కొట్టి ఉత్తరం వైపు చూడకుండా విసిరేయాలి. ఇలా చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.