New Year Vastu Tips: నూతన సంవత్సరం ఈ వస్తువులని ఇంటికి తెస్తే అంతా శుభమే..!

New Year Vastu Tips: త్వరలో 2022 సంవత్సరం చరిత్ర పుటలలో నమోదుకానుంది.

Update: 2022-12-08 12:30 GMT

New Year Vastu Tips: నూతన సంవత్సరం ఈ వస్తువులని ఇంటికి తెస్తే అంతా శుభమే..!

New Year Vastu Tips: త్వరలో 2022 సంవత్సరం చరిత్ర పుటలలో నమోదుకానుంది. మరో మూడు వారాల్లో 2023 సంవత్సరం ప్రారంభంకానుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకురావాలి. వీటిని తెచ్చుకుంటే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లోకి ఏ వస్తువులు తీసుకువస్తే శుభప్రదంగా భావిస్తారో ఈ రోజు తెలుసుకుందాం.

తులసి

తులసి మొక్క చాలా పవిత్రమైనది. తల్లి లక్ష్మి తులసిలో నివసిస్తుందని నమ్మకం. 2023 సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లోకి తులసి మొక్కను తెచ్చి నేలపై లేదా కుండలో నాటండి. ఈ పరిహారంతో లక్ష్మీ దేవి ఆశీర్వాదాలు ఏడాది పొడవునా లభిస్తాయి.

కొబ్బరికాయ

హిందూ మతంలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఆనందం, సంపద కోసం కొబ్బరికాయను ఇంట్లో ఉంచుతారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు కొత్త కొబ్బరికాయను తెచ్చి, ఎర్రటి గుడ్డలో చుట్టి మీ ఖజానాలో పెట్టండి. దీనివల్ల సంపదలు అపారంగా పెరుగుతాయని నమ్మకం.

లోహపు తాబేలు, ఏనుగు

వాస్తు ప్రకారం తాబేలు, ఏనుగు విగ్రహాలు ఆనందం, సంపదకి చిహ్నాలుగా భావిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లోకి లోహపు తాబేలు, ఏనుగును తీసుకురావడం చాలా మంచిది.

శంఖం

హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనది. ఇంట్లో శంఖాన్ని ఉంచడం వల్ల సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. రాబోయే సంవత్సరాన్ని శుభప్రదంగా మార్చడానికి ఖచ్చితంగా శంఖాన్ని తీసుకువచ్చి పూజా స్థలంలో పెట్టాలి. అంతే కాకుండా ధనం ఉంచే చోట శంఖాన్ని ఉంచాలి. ఈ పరిహారంతో ఆర్థిక శ్రేయస్సు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది.

Tags:    

Similar News