Navratri Fasting: నవరాత్రులు ఉపవాసం ఉంటున్నారా.. ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి..!

Navratri Fasting: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉంది.

Update: 2023-10-15 13:30 GMT

Navratri Fasting: నవరాత్రులు ఉపవాసం ఉంటున్నారా.. ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి..!

Navratri Fasting: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉంది. 9 రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఈ సమయంలో ఆనందం, సంపద పొందేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అలాగే 9 రోజులు ఉపవాసం పాటించడంతో పాటు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నవరాత్రులకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పర్యావరణంతో పాటు శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయాన్నే పని చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు, ఆలోచనలు చేయవద్దు. నవరాత్రి మొదటి రోజు ఆచారాల ప్రకారం పూజగదిలో కలశాన్ని పెట్టుకోవాలి. వీలైతే అఖండ జ్యోతిని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత సంతోషిస్తుంది.

9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం దుర్గామాతను పూజించాలి. సాయంత్రం హారతి ఇవ్వాలి. అలాగే అమ్మకు నచ్చిన పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. నవరాత్రులలో దుర్గామాతకు ఎర్రని వస్త్రాలను సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే మాతృ దేవతకు మేకప్ వస్తువులను అలంకరించాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత ప్రత్యేక ఆశీస్సులను పొందుతారు. నవరాత్రుల చివరి రోజున ప్రత్యేక పూజలు చేయాలి. నవరాత్రుల అష్టమి, నవమి తిథిలలో 9 మంది అమ్మాయిలకు స్వీట్లు, పాయసం తినిపించాలి. ఆడపిల్లల ఆశీస్సులు తీసుకుని వారికి బహుమతులు అందించాలి. దీనివల్ల దుర్గామాత సంతోషిస్తుంది.

Tags:    

Similar News