Mahashivratri Fasting: మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్నారా.. ఈ పండ్లు మాత్రమే తినండి ఎందుకంటే..?

Mahashivratri Fasting: మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో పండ్లు, పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు.

Update: 2024-03-08 13:19 GMT

Mahashivratri Fasting: మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్నారా.. ఈ పండ్లు మాత్రమే తినండి ఎందుకంటే..?

Mahashivratri Fasting: మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో పండ్లు, పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మంచివి కావు. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. అందుకే ఉపవాసం సమయంలో పొట్టకు అనుకూలంగా ఉండే పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఉపవాస సమయంలో పోషకాహారం లభిస్తుంది.

ద్రాక్ష

ద్రాక్ష పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది ఉపవాస సమయంలో తక్షణ శక్తిని అందిస్తుంది. ద్రాక్ష తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు.

పియర్

పియర్‌ ఫైబర్‌కు పెట్టింది పేరు. దీనిని తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలివేయదు. ఇందులో విటమిన్ సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి, ఎముకల గట్టితనానికి దోహదం చేస్తాయి.

అరటిపండు

ఉపవాసం సమయంలో తీసుకోవాల్సి పండ్లలో అరటి పండు ఒకటి. ఇది తక్షణం శక్తిని అందిస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉపవాస సమయంలో అరటిని తీసుకుంటే పొట్ట నిండుగా ఉంటుంది.

యాపిల్‌

ఉపవాసం సమయంలో యాపిల్‌ తీసుకుంటే శరీరానికి మంచిది. యాపిల్‌లో ఫైబర్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సాయం చేస్తుంది. యాపిల్‌ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

Tags:    

Similar News