Marriages Muhurtas: వివాహాలకు త్వరపడండి.. కేవలం తక్కువ ముహూర్తాలే ఉన్నాయి..!

Marriages Muhurtas 2023- 2024: పెళ్లిళ్లు కుదరినవారు త్వరపడాలి. లేదంటే ఉన్న మంచి సమయం మించిపోతుంది.

Update: 2023-11-23 15:00 GMT

Marriages Muhurtas: వివాహాలకు త్వరపడండి.. కేవలం తక్కువ ముహూర్తాలే ఉన్నాయి..!

Marriages Muhurtas 2023- 2024: పెళ్లిళ్లు కుదరినవారు త్వరపడాలి. లేదంటే ఉన్న మంచి సమయం మించిపోతుంది. ఈ ఏడాదిలో అంటే నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య చాలా తక్కువ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 4 నెలలుగా నిలిచిపోయిన పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. 23 నవంబర్ 2023 నుంచి డిసెంబర్ 15 వరకు వివాహాలకు అనుకూల ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటిపోయయాంటే ఇక వచ్చే సంవత్సరమే.

కేవలం 10 ముహూర్తాలు మాత్రమే

నవంబర్ 23 నుంచి వివాహ శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది ముగిసే నాటికి కేవలం 10 శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి 15 డిసెంబర్ 2023 నుంచి 15 జనవరి 2024 వరకు ఒక నెల ఖర్మల కారణంగా వివాహాలకు అనుకూల సమయం కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సమయంలో వివాహాలు జరగవు. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే 2024 సంవత్సరంలో మకర సంక్రాంతి వరకు వేచి ఉండాలి. మకర సంక్రాంతి తర్వాతే మళ్లీ ముహూర్తాలు మొదలవుతాయి. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా దీపావళి తర్వాత వివాహాలకు చాలా తక్కువ ముహుర్తాలు మాత్రమే ఉన్నాయి.

నవంబర్ నుంచి డిసెంబర్ వివాహ సమయం

నవంబర్ నెలలో వివాహ శుభ సమయం నవంబర్ 28, 29 తేదీలలో ఉంటుంది. దీని తరువాత డిసెంబర్లో వివాహం చేసుకోవడానికి 8 శుభ ముహూర్తాలు ఉంటాయి. డిసెంబర్‌లో వివాహానికి అనుకూలమైన సమయాలు డిసెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 13. ఈ ముహూర్తాలలో పెళ్లి చేసుకోపోతే 2024 జనవరి 16, 22, 27, 31 తేదీల వరకు ఆగాల్సి ఉంటుంది.

Tags:    

Similar News