Navagraha Darshan: నవగ్రహాల దర్శనం ఏ విధంగా చేసుకోవాలి.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Navagraha Darshan: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వివిధ దేవుళ్లని ఆరాధించే పద్దతులు వివిధ రకాలుగా ఉంటాయి.

Update: 2023-08-11 14:30 GMT

Navagraha Darshan: నవగ్రహాల దర్శనం ఏ విధంగా చేసుకోవాలి.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Navagraha Darshan: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వివిధ దేవుళ్లని ఆరాధించే పద్దతులు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ విధంగా చేస్తేనే వారికి మంచి జరుగుతుంది. లేదంటే ఎంత భక్తి ఉన్నా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిలా అవుతుంది. మానవుని జీవితంపై నవగ్రహాల ప్రభావం ఖచ్చితముగా ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం వల్ల మంచి చెడులు జరుగుతుంటాయి. అందుకే చాలామంది నవగ్రహాలని ఆరాధిస్తారు. కానీ కొన్ని పొరపాట్లు చేస్తారు. వీటివల్ల ఎలాంటి ఫలితం దక్కదు. నవగ్రహాలని పూజించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

నవగ్రహాల పూజకి ఒక విధి విధానం ఉంటుంది. నవగ్రహ మూర్తులు ముఖ్యంగా శివాలయాలలో ఉంటారు. ఆలయంలోనికి ప్రవేశించినపుడు ముందు నవగ్రహాలను దర్శించి ఆఖరిలో గర్భాలయంలో ఉన్న మూలావిరాట్‌ను దర్శించుకొని వెళ్ళడం మంచిది. నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేయాలి. నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తరువాతే మిగిలిన ఆలయాల ప్రదక్షిణలు చేయాలని గుర్తుంచుకోండి.

నవగ్రహాలకు అధినాయకుడు సూర్యుడు, ఆయన్ని ముందుగా తలుచుకొని తరువాత చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు కేతువులు ఇలా అందరిని దర్శించుకుంటూ వారి స్తోత్రాలను నామాలను పఠించాలి. ఇలా నవగ్రహ దర్శనం చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆలయ మూలవిరాట్‌ను దర్శించి తీర్థ ప్రసాదం తీసుకోవాలి. నవగ్రహలని దర్శించుకున్నరోజు, ప్రదక్షిణలు ఆచరించిన రోజు ఆహార విషయాలలో కొన్ని నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం స్వీకరించడం, దైవచింతనతో ఉండటం వల్ల ఉత్తమఫలితాలు దక్కుతాయి.

Tags:    

Similar News