Vastu Tips: అలాంటి ఫొటోలను ఇంట్లో ఉంచుతున్నారా.. బ్యాడ్‌లక్ మీ ఇంట్లో తిష్ట వేసినట్లే.. అవేంటో తెలుసా?
Vastu Tips: మీరు మీ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లలో గోడలపై గుర్రం ఫొటోను తప్పక చూసే ఉంటారు.
Vastu Tips: మీరు మీ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లలో గోడలపై గుర్రం ఫొటోను తప్పక చూసే ఉంటారు. పరిగెత్తే గుర్రాల బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టడం ద్వారా ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకాలతో ఉంటారు. గోడపై ఇలాంటి ఫొటోను కలిగి ఉండటం సానుకూల శక్తిని, విజయాన్ని తెస్తుందని అంటుంటారు. అయితే ఇది నిజంగా సరైనదేనా? ఇంట్లో లేదా ఆఫీసులో పరుగెత్తే గుర్రం ఫొటోను ఉంచడం నిజంగా అదృష్టం కలిగిస్తుందా? జ్యోతిష్య నిపుణుల ప్రకారం అసలైన సమాచారం తెలుసుకుందాం.
జ్యోతిష్యుల ప్రకారం, ఇంట్లో పరుగెత్తే గుర్రాల ఫొటోలను ఉంచే ముందు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. పరిగేత్తే గుర్రాలు కొనసాగింపుకు చిహ్నం. కానీ వాటితో ఇంట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి చాలా కష్టపడాలి, విజయం కోసం బాగా శ్రమించాల్సి వస్తుందని చెబుతున్నారు.
పరిగెత్తే గుర్రాల ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటే బిజీనెస్ పెరుగుతుందని అంటున్నారు. అయితే, అధికంగా పరిగెత్తడం అనేది ఆందోళనలు మరింత పెంచుతుంది. చిన్న విషయానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే మీ ఇంటి లేదా ఆఫీసు గోడలపై పరుగెత్తే గుర్రాల ఫొటోలను పెట్టకపోవడమే మంచిది.
అలాంటి ఫొటోలను ఇంట్లో పెట్టవద్దు..
ఇది కాకుండా, మీరు ఇంట్లో కొన్ని ప్రత్యేక ఫొటోలను కూడా ఉంచకూడదు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, తాజ్ మహల్, మహాభారతం, కాక్టస్ పెయింటింగ్, పూర్వీకుల ఫొటో, మునిగిపోతున్న ఓడ, హింసాత్మక జంతువుల చిత్రాలు, ఫౌంటెన్ లేదా జలపాతం ఫొటోలను ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో లేదా ఆఫీసులో ఇలాంటి ఫొటోలు ఉంటే అశుభంగా చెబుతున్నారు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, మత విశ్వాసాలను అనుసరించి ఉంటుంది. HMTV వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి.)